Intranasal Corona Vaccine : భారత్ లో అందుబాటులోకి కరోనా నాసల్ వ్యాక్సిన్

భారత్ లో తొలి కరోనా ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ను రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ జితేందర్ సింగ్ ఆవిష్కరించారు.

Intranasal Corona Vaccine : భారత్ లో అందుబాటులోకి కరోనా నాసల్ వ్యాక్సిన్

corona vaccine

Intranasal Corona Vaccine : భారత్ లో తొలి కరోనా ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కు ద్వారా అందించే కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ను రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ జితేందర్ సింగ్ ఆవిష్కరించారు.

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఇంకోవాక్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. గతవారంలో కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాక్సిన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో బూస్టర్ డోస్ గా వేసేందుకు డీజీఐసీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.

AstraZeneca: ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ వల్ల ‘బ్లడ్ కాటింగ్’ ముప్పు అధికం.. పరిశోధనలో వెల్లడి

వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి రూ.325లకు, ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాలకు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది.