Online Liquor Delivery: ఆన్‌లైన్‌లో మద్యం.. హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్

అస్సాంలో మొదటి దశలో, గౌహతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్రమంగా దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రారంభిస్తారు.

Online Liquor Delivery: ఆన్‌లైన్‌లో మద్యం.. హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్

Online Liquor

Online Liquor Delivery: అస్సాంలో మొదటి దశలో, గౌహతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్రమంగా దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రారంభిస్తారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలు, సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఎక్సైజ్ విభాగం నోటిఫికేషన్ జారీచేసింది.

రద్దీని నివారించడానికి, భౌతిక దూరం నియమాన్ని పాటించేలా చూసేందుకు, ఆన్‌లైన్ అమ్మకాలతో పాటు మద్యం హోమ్ డెలివరీని కూడా చెయ్యాలని శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో అస్సాం అబ్కారీ శాఖ స్పష్టంచేసింది. గువహతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో దేశ, విదేశీ మద్యం మరియు బీర్లను ఆన్‌లైన్ అమ్మకం ద్వారా తక్షణమే అమ్మకాలు ప్రారంభమైనట్లు తెలిసింది.

ఈ నిర్ణయంతో ఉదయం 11గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం హోం డెలివరీ అందుబాటులో ఉండనుంది. అయితే, డెలివరీ ఏజెంట్లు ఒకేసారి 9 లీటర్లకు మించి మద్యాన్ని తమ వెంట ఉంచుకునే వీలు లేకుండా పరిమితి విధించింది ఆబ్కారీశాఖ. అర్హులైన వినియోగదారులు మూడు లీటర్ల వరకు మద్యాన్ని ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంది.

హాస్టళ్లు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా ప్రదేశాలకు మద్యం డెలివరీ ఉండదని స్పష్టం చేసింది ప్రభుత్వం పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌ఘర్, కర్ణాటక, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఆన్‌లైన్ అమ్మకాలు మరియు మద్యం పంపిణీ ఇప్పటికే ప్రారంభమైంది.