Vikram-S Launching: భారత అంతరిక్ష రంగంలో నేడు కొత్త శకానికి నాంది.. మరికొద్దిసేపట్లో నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్

భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త, ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరును కలిసొచ్చేలా ‘విక్రమ్-ఎస్’ అనే పేరును పెట్టారు. ఈ మిషన్ ప్రయోగంలో భారత్ విజయం సాధిస్తే ప్రైవేట్ స్పేస్ రాకెట్ ప్రయోగ విషయంలో ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో భారత్ చేరుతుంది.

Vikram-S Launching: భారత అంతరిక్ష రంగంలో నేడు కొత్త శకానికి నాంది.. మరికొద్దిసేపట్లో నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్

Vikram-s

Vikram-S Launching: భారత అంతరిక్షం రంగంలో నేడు కొత్త శకానికి అడుగులు పడనున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ‘ విక్రమ్- ఎస్’ను ప్రయోగించనుంది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ రాకెట్‌ను తయారు చేసింది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. ఈ మిషన్ కు ‘ప్రారంభ్’ అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం ప్రవేశానికి మార్గం సుగమం అవుతుంది.

Vikram S: నింగిలోకి దూసుకెళ్లనున్న భారత మొదటి ప్రైవేట్ రాకెట్

రాకెట్‌కు భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త, ఇస్రో వ్యవస్థాపకుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరును కలిసొచ్చేలా ‘విక్రమ్-ఎస్’ అనే పేరును పెట్టారు. ఈ మిషన్ ప్రయోగంలో భారత్ విజయం సాధిస్తే ప్రైవేట్ స్పేస్ రాకెట్ ప్రయోగ విషయంలో ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో భారత్ చేరుతుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రానున్నారు.

ప్రయోగానికి ముందు రాకెట్‌ను అనేక రకాలుగా పరీక్షించారు. విక్రమ్-ఎస్ రాకెట్‌ మొత్తం మూడు చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. వీటిలో రెండు భారత్‭కు చెందినవి కాగా, మూడవది విదేశీ సంస్థది. ఈ ప్రయోగం నవంబర్ 12 నుంచి 16 తేదీల మధ్య జరగాల్సి ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా వేసి వేసినట్టు స్కైరూట్ ఎరోస్పేస్ ఒక ప్రకటనలో పేర్కొంది.