అగస్త్యకూడంపై తొలి మహిళ : చరిత్ర సృష్టించిన  ధన్య సనాల్ 

  • Published By: veegamteam ,Published On : February 21, 2019 / 10:10 AM IST
అగస్త్యకూడంపై తొలి మహిళ : చరిత్ర సృష్టించిన  ధన్య సనాల్ 

తిరువనంతపురం: అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై శబరిమల రగులుతుండగానే మరో అంశం తెరపైకి వచ్చింది. కేరళలో స్త్రీలకు ప్రవేశం లేని మరో పుణ్యక్షేత్రం.. అగస్త్యకూడం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నిషేధాన్ని బద్దలు కొడుతు..ఓమహిళ అగస్త్యకూడంపై కాలు మోపింది. ఆమే ధన్య సనాల్. 

అగస్త్యకూడం కొండపైకి మహిళల ప్రవేశంపై ఉన్న అనధికారిక నిషేధాన్ని ఎత్తివేస్తూ గత నవంబర్‌లో కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ఆర్మీ అధికార ప్రతినిధి అయిన ధన్య సనాల్ సోమవారం (ఫిబ్రవరి 18)  పురుషులతోపాటుగా ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కోర్టు తీర్పు అనంతరం తొలిసారిగా  ట్రెక్కింగ్‌ను రాష్ట్ర అటవీ శాఖ సోమవారం ప్రారంభించిన రాష్ట్ర అటవీశాఖ మార్చి 1 వరకు దీన్ని కొనసాగించనుంది. 1,868 మీటర్ల ఎత్తయిన ఈ కొండపైకి తొలి బ్యాచ్‌లో 100 మంది ని ట్రెక్కింగ్‌కు అనుమతించగా..అందులో ధన్య ఒక్కరే మహిళ కావటం విశేషం.
 

ఈ క్రమంలో కొండపైకి మహిళల ప్రవేశంపై స్థానిక కణి తెగ ప్రజలు నిరసన తెలుపుతున్నారు. మా విశ్వాసాలు, ఆచారాలకు మండగలుపుతున్నారని మండిపడుతున్నారు. మాకులదైవం అయిన అగస్త్యముని అవమానించినట్లేనంటు..కొండపైకి వెళ్లే ప్రవేశ మార్గం బోనకాడ్ వద్ద జానపద పాటలతో గిరిజనులు నిరసన తెలిపారు. 
కొండను అధిరోహించిన ధన్యా మాట్లాడుతు..అధికారికంగా..ఈ కొండను ఎక్కిన తొలి మహిళను తానేననన్నారు.ప్రకృతిని అందరూ ప్రేమిస్తారు..మరి  అలాంటప్పుడు లింగ వివక్ష ఉండకూడదన్నారామె. భవిష్యత్తులో మరింత మంది మహిళలు ట్రెక్కింగ్‌ వస్తారని తాను ఆశిస్తున్నానన్నారు. 1,868 మీటర్ల ఎత్తున్న ఈ కొండపైకి ట్రెక్కింగ్‌కు ఇంతకాలం అతివలను నిషేధించిన క్రమంలో హైకోర్టు నిషేధం ఎత్తివేయటంతో అగస్త్యకూడం కొండపైకి ట్రెక్కింగ్‌కు వెళ్లేందుకు పేర్లు నమోదు చేసుకున్నవారు 4700 మంది కాగా..వారిలో 100 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమలకు మహిళ దర్శనం అనేది ఎంతటి వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశం కేరళ రాష్ట్రాన్ని కాక దేశమంతా పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అగస్త్యకూడం మరో శబరిమల కానుందా..వేచి చూడాలి.

Read Also:చింతమనేని కంప్లయింట్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అరెస్టు
Read Also:నీళ్ల ట్యాంకే గుడి : పూజలు చేస్తున్న గ్రామస్థులు
Read Also:కడప నేతలతో చంద్రబాబు భేటి.. అభ్యర్ధులు వీరేనా!