Agra : విషాదం, సెప్టిక్ ట్యాంక్ లో బాలుడు..కాపాడేందుకు వెళ్లి..ఐదుగురు చనిపోయారు

Agra : విషాదం, సెప్టిక్ ట్యాంక్ లో బాలుడు..కాపాడేందుకు వెళ్లి..ఐదుగురు చనిపోయారు

Septic Tank

Five Drown In Septic Tank : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగిపోయింది. సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయిన  బాలుడిని కాపాడేందుకు వెళ్లిన నలుగురు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. తమ వారు చనిపోయారన్న తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది.

ఫతేహాబాద్ పీఎస్ పరిధిలో ప్రతాపూర్ గ్రామంలో 10 సంవత్సరాలున్న బాలుడు..అనురాగ్ ఆడుకుంటూ..వెళ్లి ఇంటి సమీపంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చిన్నారిని కాపాడేందుకు ముందుకొచ్చారు. ట్యాంకులో దిగిన నలుగురు ఊపిరిఆడక చనిపోయారు. ఆసుపత్రికి తరలించగా..బాలుడితో సహా..నలుగురు అప్పటికే మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. అనురాగ్, సోను(12), రామ్ ఖిలాడీ హరిమోహన్(16), అవినాశ్(12)గా గుర్తించారు. వీరిలో అవినాశ్, అనురాగ్, హరిమోహన్ సోదరులు కావడం గమనార్హం.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.