Encounter : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి

రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అటవీ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు గుర్తించారు.

Encounter : జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి

Encounter (1) (1)

Encounter : జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులు జవాన్లపై పేలుడు పదార్ధం విసిరారని ఆర్మీ తెలిపింది. ఇటీవల జమ్మూ రీజియన్ లో ఆర్మీ ట్రక్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అటవీ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు శుక్రవారం ఉదయం గుర్తించారు.

Rahul Bhat: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు మృతి

దీంతో సైనికులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఉదంపూర్ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమించడంతో మరో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. కాగా, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీనియర్ అధికారి తెలిపారు. అదనపు బలగాలను రప్పించామని పేర్కొన్నారు. ఉగ్రవాద గ్రూప్ లో కొందరు మరణించి ఉంటారని ఆర్మీ వెల్లడించింది.