Omicron In India : భారత్‌లో 5కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్

ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లో అలజడి రేపుతోంది. దేశంలో రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది.

Omicron In India : భారత్‌లో 5కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి సోకిన వైరస్

Omicron

Five omicron cases in India : ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లో అలజడి రేపుతోంది. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది.

ఇక ఢిల్లీలో పదు సంఖ్యలో ఒమిక్రాన్ అనుమానితులను గుర్తించిన అధికారులు.. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా…వాటి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముందు కర్నాటకలో 2, ఆ తర్వాత గుజరాత్ లో 1, మహారాష్ట్రలో మరొకటి బయట పడగా, ఇప్పుడు ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ బయట పడటంతో మరింత కలవర పెడుతోంది.

Road Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

భారత్ లో కరోనా థర్డ్ వేమ్ ప్రమాద ఘంటికలు మోగనున్నాయా? కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విహారం చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పేలా లేదని అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెగలు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ భారత్ లో అంతకంతకూ వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు ఇప్పుడిప్పుడే ఇండియాలోకి రాదులే అనుకుంటున్న వర్రీ వేరియంట్ ఎంట్రీ ఇచ్చేసింది. మూడు రోజుల వ్యవధిలోనే ఐదుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మూడో వేవ్ ముప్పును తెచ్చి పెట్టనుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఒమిక్రాన్ తో మూడో వేవ్ రాకుండా, అది వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలంతా రెండు డోసుల టీకాలు వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పాటు కోవిడ్ ప్రోటో కాల్స్ పాటించాలని కోరుతున్నారు. ఇప్పటికే దేశంలో ఐదు ఒమిక్రాన్ వేరియంట్ కేసులను ధృవీకరించారు. అనేక మంది అనుమానితులను కూడా గుర్తించారు. ఇది వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వ అన్ని చర్యలను వేగవంతం చేసింది.

Army Fire : ఉగ్రవాదులనుకుని కూలీలపై ఆర్మీ కాల్పులు.. 11 మంది మృతి

డెల్టా వేరియంట్ సృష్టించిన నష్టాన్ని ఒమిక్రాన్ సృష్టించకుండా ఉండేలా పక్కా ప్రణాళికలు రూపొందించింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది. దేశంలో కరోనాను కట్టడి చేయాలని, కేసుల సంఖ్య తగ్గించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇలా పకడ్బందీగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.