Non-Veg Carts: రోడ్లపై నాన్‌వెజ్ అమ్మకాలపై నిషేధం.. సీఎం చెప్పిన 5కారణాలు ఇవే

మాంసాహారంపై కఠిన ఆంక్షలు పెట్టేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

Non-Veg Carts: రోడ్లపై నాన్‌వెజ్ అమ్మకాలపై నిషేధం.. సీఎం చెప్పిన 5కారణాలు ఇవే

Non Veg

Non-Veg Carts: మాంసాహారంపై కఠిన ఆంక్షలు పెట్టేసింది గుజరాత్ ప్రభుత్వం. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ వెజ్ ఫుడ్‌ని వీధిలో బహిరంగంగా పెట్టకూడదని, స్కూళ్లకు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల దూరంలోనే నాన్ వెజ్ పదార్థాలను పెట్టాలని ఆంక్షలు విధించింది. గుడ్లతో తయారుచేసిన వంటకాన్నైనా బహిరంగంగా అమ్మకానికి వీల్లేదని స్పష్టం చేసింది.

అంతేకాదు.. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను మాత్రమే నాన్‌వెజ్ అమ్మే ప్రాంతాలుగా చెయ్యాలని, ముఖ్యంగా మెయిన్ రోడ్లకు దూరంగా ఈ అమ్మకాలు జరగాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆహారపు అలవాట్లతో ఎటువంటి సమస్య లేదని, కానీ, ఈ నిబంధనలు పెట్టడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని వెల్లడించారు.

1. అపరిశుభ్రత “Unhygienic”:
రోడ్లపై మాంసాహారం అమ్మడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. రోడ్లపై ‘లారీలు’, బస్సులు, పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి వచ్చే దుమ్ము, దూళి మాంసాహారంపై పడుతూ ఉంటుంది. వాటిని అపరిశుభ్ర వాతావరణంలో ఎక్కువగా అమ్ముతున్నారు.

2. Obstructing traffic “ట్రాఫిక్‌కు అంతరాయం”:
రోడ్లపై చిన్న చిన్న బండ్లు మీద పెట్టి నాన్‌వెజ్ అమ్మడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ఆహార బండ్లను తొలగించడం అనేది చాలా ముఖ్యమని, స్థానిక పౌర సంస్థలు ఈమేరకు నిర్ణయాలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. “స్థానిక మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు ఆహార బండ్లను తొలగించడానికి నిర్ణయాలు తీసుకుంటాయి. సిటీ రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే మాత్రం కచ్చితంగా వాటిని తొలిగించవచ్చు’’ అని చెప్పారు ముఖ్యమంత్రి.

3. “Foul smell” -“దుర్వాసన”:
మతపరమైన ప్రదేశాలు, ఉద్యానవనాలు, బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు మరియు కళాశాలల 100 మీటర్ల పరిధిలో నాన్‌వెజ్ అమ్మే బండ్లు నిషేధించడానికి కారణం దుర్వాసన. నడుస్తూపోతూ ఉంటే వాసన చాలా ఇబ్బందిగా ఉందని, మతపరమైన ప్రదేశాలను సందర్శించేవారికి ఇది చాలా ఇబ్బందిగా ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. చిన్నపిల్లల మనస్సులపై ఈ వాసనలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.

4. రోడ్లపై స్థలాల ఆక్రమణ “Encroachment drive”:
మాంసం అమ్మే దుకాణాల కోసం చాలామంది చట్టవిరుద్ధంగా స్థలాలను ఆక్రమించారని వాటిని తొలిగించే క్రమంలో వీటిని తీసివెయ్యమని చెబుతున్నట్లు కూడా చెబుతున్నారు అధికారులు.

5. మతపరమైన విశ్వాసాలు “Hurt religious Sentiments, Health hazard”:
‘ఫుడ్ స్టాల్స్.. ప్రత్యేకించి చేప, మాంసం, గుడ్లు అమ్మే దుకాణాలు మెయిన్ రోడ్‌కు దూరంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దారిలో పోయేవారికి కనపడకుండా ఉంచడం ద్వారా మతపరమైన మతపరమైన మనోభావాలు దెబ్బతీనవని కూడా అంటున్నారు. గతంలో తప్పులని సరిదిద్దే సమయం వచ్చిందని అంటున్నారు.

Lahore Most Poluted city :ఢిల్లీని మించిపోయింది..ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా లాహోర్