Five Star Hotel : రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్
భారత రైల్వేశాఖ, రైలు పట్టాలపై ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించబోతోంది. గుజరాత్ లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ను కొత్త హంగులతో సుందరీకరిస్తుంది రైల్వే శాఖ.. దీంతోపాటు ఓ ఫైవ్ స్టార్ హోటల్ ను నిర్మిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి ఇండియన్ రైల్వేస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈ హోటల్ నిర్మిస్తుంది.

Five Star Hotel
Five Star Hotel : భారత రైల్వేశాఖ, రైలు పట్టాలపై ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించబోతోంది. గుజరాత్ లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ను కొత్త హంగులతో సుందరీకరిస్తుంది రైల్వే శాఖ.. దీంతోపాటు ఓ ఫైవ్ స్టార్ హోటల్ ను నిర్మిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి ఇండియన్ రైల్వేస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈ హోటల్ నిర్మిస్తుంది.
ఈ ఫైవ్ స్టార్ హోటల్‌ను లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఈ హోటల్ లో మొత్తం 300 గదులు ఉండేలా నిర్మించనున్నారు. పైనుంచి చూస్తే పూరేకులుగా కనిపించేలా మూడు టవర్లను నిర్మిస్తారు. ఈ హోటల్ ప్రాజెక్ట్‌పై రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ స్పందించారు.
ఇది ప్రత్యేకమైన మోడల్. కింద రైళ్లు తిరుగుతున్నా ప్రకంపనలు, ఎటువంటి చప్పుడు హోటల్‌లో ఉన్న వారికి తెలియకుండా డిజైన్ చేస్తున్నామని తెలిపారు. నిజానికి అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులు సాధారణమే అయినా.. ఇండియాలో మాత్రం రైలు పట్టాలపై ఇదే తొలి ఫైవ్ స్టార్ హోటల్ అని అన్నారు. దీని నిర్మాణానికి రెండేళ్ల సమయం పడుతుందని తెలిపారు.