Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ని సీట్లు అవసరం, వివరాలు

ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే...

Five States Election : ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్ని సీట్లు అవసరం, వివరాలు

Elections

Five states Assembly Election : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఉత్కంఠ రేపుతున్న ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల్లో పట్టు నిలపెట్టుకుందా ? ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందా ? దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతాయా అనే ఆసక్తి నెలకొంది. ప్రధానంగా యూపీలో మరోసారి అధికారం దక్కించుకుని బీజే పీ చరిత్ర తిరగరాస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 2024 సంవత్సరంలో జరిగే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పార్టీలకు ఎన్ని సీట్లు రావాల్సి ఉంటుందనేది తెలుసుకోవాల్సిన విషయం.

Read More : ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు

పంజాబ్ : ఈ రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకైనా 59 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్, అకాలీదళ్, శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆప్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీ ఇక్కడ బరిలోకి దిగి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంచనాలున్నాయి.

Read More : 5 States Elections Exit Polls – 2022 : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపెవరిది..? ఎగ్జిట్ పోల్స్- Live Updates

ఉత్తర్ ప్రదేశ్ : ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉంది. మొత్తం ఇక్కడ 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. అధికార పీఠం దక్కాలంటే… పూర్తి మెజార్టీ పొందడానికి దాదాపు 202 సీట్లు అవసరం ఉంటుంది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

Read More : ఎగ్జిట్ పోల్స్ : బెంగాల్ మమతదే..అసోంలో బీజేపీనే..కేరళలో మళ్లీ లెఫ్ట్..పుదుచ్చేరి బీజేపీదే,తమిళనాడులో డీఎంకే క్లీన్ స్వీప్

గోవా : చిన్న రాష్ట్రం. రెండు సంవత్సరాలుగా రాజకీయ అస్థిరత ఉంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజార్టీ సాధించాలంటే 21 సీట్లు అవసరం ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొనగా.. ఇప్పటి నుంచే క్యాంపు రాజకీయాలు సాగుతున్నాయి.

Read More : Assembly Elections: ముగింపు దశకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 2023లో తొమ్మిది రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు

మణిపూర్ : ఈ రాష్ట్రంలో NPF, NPP, LGP పార్టీలతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజార్టీ సాధించాలంటే ఏ పార్టీకైనా 31 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

ఉత్తరాఖండ్ : ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. అధికారంలోకి రావాలంటే… 36 మ్యాజిక్ ఫిగర్ సంపాదించాల్సి ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరి ఏ పార్టీ అధికారం సాధిస్తుందో వేచి చూడాలంటే.. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే