Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

National

Election Results 2021 : గెలుపెవరిది..? నేడే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అందరి చూపు ఆ రాష్ట్రంపైనే..

దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.

Updated On - 7:50 am, Sun, 2 May 21

Election Results 2021

Five States Assembly Election Results 2021 : దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి. వెస్ట్ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో రిజల్ట్స్ ఎలా ఉండవచ్చో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే.

ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కించనున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నాకి దాదాపు ఫలితాలపై అంచనా వస్తుంది.

ఎవరి అంచనాలు వారివి:
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని మాత్రం బీజేపీకి మొగ్గు ఉంటుందని పేర్కొన్నాయి. తమిళనాడులో మాత్రం డీఎంకే-కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అన్ని సర్వేలూ ముక్తకంఠంతో చెప్పాయి. ఇటు కేరళలోనూ అధికార ఎల్డీఎఫ్ మరోసారి విజయం సాధించనుందని తెలిపాయి. అసోంలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని కొన్ని, హంగ్ వస్తుందని మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. ఇక, పుదుచ్చేరిలో బీజేపీ కూటమికే అధికారం దక్కుతుందని సర్వేలన్నీ వెల్లడించాయి. కాంగ్రెస్‌‌కు ఇక్కడ రిక్తహస్తమే మిగులుతుందని తెలిపాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఏమైనా ఊహించని మార్పులు ఉంటాయా? అనేది మరి కొద్ది గంటల్లో తెలిపోనుంది.

కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల తీరు గురించి ఓటర్ల మదిలో ఏముందనేది ఆదివారం నాటి ఫలితాల ద్వారా కొంతవరకు తెలుస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 78.22% వరకు కేవలం 11 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిలో కేరళ, తమిళనాడు, బెంగాల్‌ ఉన్నాయి. పశ్చిమ్ బెంగాల్‌లో 294 స్థానాలు, తమిళనాడులో 234 స్థానాలు, కేరళలో 140, అసోం 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలున్నాయి. 5 చోట్ల కలిపి మొత్తం 822 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో లక్షకు పైగా సిబ్బంది, అధికారులు పాల్గొంటున్నారు.

అందరి చూపు బెంగాల్ వైపు:
ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మిగతావాటి కంటే.. దేశం యావత్తు బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే బీజేపీ, టీఎంసీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ అగ్రనాయకత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఇక్కడ ప్రచారం నిర్వహించింది. అటు, మమతా కూడా సర్వశక్తులూ ఒడ్డి ఒంటరి పోరాటం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మరోసారి విజయం సాధిస్తారా, మోడీ-అమిత్‌షాల నేతృత్వంలో విస్తృతంగా సాగిన ప్రచారం ఫలిస్తుందా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. మమత తన రాజకీయ జీవితంలో ఇంతటి సవాల్‌ను ఎన్నడూ ఎదుర్కోలేదు.

సాగర్, తిరుపతిలో గెలుపెవరిది?
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన తిరుపతి పార్లమెంట్, నాగార్జున సాగర్ శాసన సభ స్థానాల్లో ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. పటిష్ట భద్రత, కఠిన కరోనా నిబంధనల మధ్యే ఓట్ల లెక్కింపు జరుగనున్నాయి. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక పార్టీలు గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం సాగర్ లో టీఆర్ఎస్, తిరుపతిలో వైసీపీ గెలుస్తాయని అంచనా వేశాయి. విజేత ఎవరనేది కాసేపట్లో క్లారిటీ రానుంది.

వివిధ కారణాల వల్ల ఈసారి ఈ బ్యాలెట్లు గతసారి కంటే నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. వీటి లెక్క పూర్తయ్యాక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తెరవబోతున్నారు. కరోనా తీసుకొచ్చిన సమస్యలను, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలతో ఓట్ల లెక్కింపు బల్లల అమరిక నుంచి అన్నింటా అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నానికి ఓటర్ల తీర్పు సరళి, సాయంత్రం 5 గంటలకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు. లెక్కింపును 1100 మంది పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్‌సైట్‌, యాప్‌లలో తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Masterminds Image CompAha Itng Drcarebanner
Andhrapradesh14 mins ago

AP State Government : ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యంపై సవరణ

Exclusive Videos28 mins ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ: Suspense Continues Over Telangana PCC Chief Post | 10TV News

Andhrapradesh40 mins ago

Kadapa : కడప మఠం పీటముడి, ప్రభుత్వం ఏం చేయనుంది ?

Latest41 mins ago

Tourists Rush Shimla : సిమ్లాలో ఆంక్షలు ఎత్తివేత.. పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్!

Exclusive54 mins ago

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Exclusive1 hour ago

కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Latest2 hours ago

Eatala Rajender : ముహూర్తం ఫిక్స్, బీజేపీలోకి ఈటల

Latest2 hours ago

Hyderabad Rain : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

Latest2 hours ago

TTDP : కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Exclusive2 hours ago

ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

Latest2 hours ago

CM KCR : సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్

Latest2 hours ago

French Open: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్

Latest3 hours ago

Inter Online Classes : జులై 1 నుంచి ఇంటర్‌ సెకండ్ ఇయర్ ఆన్‌లైన్‌ క్లాసులు

Latest10 hours ago

Patent Waiver On Covid Vaccines : భారత్ ప్రతిపాదనకు జీ-7 మద్దతు..కోవిడ్ వ్యాక్సిన్లపై పేటెంట్​ హక్కుల రద్దు!

Crime News11 hours ago

Ziona Chana : 38 మంది భార్యల ముద్దుల భర్త మృతి

Latest2 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest3 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest5 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest6 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest7 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Exclusive Videos28 mins ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ: Suspense Continues Over Telangana PCC Chief Post | 10TV News

Exclusive54 mins ago

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Exclusive1 hour ago

కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Exclusive2 hours ago

ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

Exclusive15 hours ago

హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?

Exclusive15 hours ago

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో భారీగా నిలిచిన వాహనాలు

Exclusive15 hours ago

11 నిమిషాల ట్రిప్… రూ.205 కోట్ల టికెట్

Exclusive17 hours ago

ఢిల్లీ వాసులకు శుభవార్త

Exclusive Videos2 days ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos2 days ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos2 days ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos2 days ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos2 days ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Exclusive Videos3 days ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos3 days ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Masterminds Image Comp