Election Results 2021: బెంగాల్, తమిళనాడులో మొదలైన సంబరాలు!

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శనివారం ఉదయమే లెక్కింపు మొదలవగా దాదాపుగా ఉదయం పదిగంటలకు కొంతమేర ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది స్పష్టత వచ్చేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలు దాదాపుగా పూర్తిస్థాయి స్పష్టత వచ్చేసింది.

Election Results 2021: బెంగాల్, తమిళనాడులో మొదలైన సంబరాలు!

Election Results 2021

Five States Election Results 2021: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శనివారం ఉదయమే లెక్కింపు మొదలవగా దాదాపుగా ఉదయం పదిగంటలకు కొంతమేర ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది స్పష్టత వచ్చేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలు దాదాపుగా పూర్తిస్థాయి స్పష్టత వచ్చేసింది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతుంటే.. బెంగాల్ లో టీఎంసి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి ఎక్కువ స్థానాలలో అధీక్యంలో కొనసాగుతుంది. ఇక కేరళ, అస్సాంలో కూడా అధికార పార్టీలే అధీక్యాన్ని కొనసాగిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల అధికార పార్టీలు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బెంగాల్లో‌ తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుంటే.. అసోంలో బీజేపీ వరుసగా రెండోసారి, కేరళలో ఎల్డీఎఫ్‌లు రెండోసారి అధికారంలోకి రానున్నారు. నాలుగు రాష్ట్రాలలో అత్యధిక స్థానాల్లో ఆ పార్టీల అభ్యర్ధులే ముందంజలో దాదాపుగా నాలుగు రాష్ట్రాలలో స్పష్టమైన మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో సంబరాలు మొదలయ్యాయి.

ఐదేళ్లుగా అధికారం కోసం వేచి చూస్తున్న డీఎంకె విజయం ఖరారవడంతో చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక పశ్చిమ బెంగాల్ లో కూడా తీవ్రమైన యుద్ధమే నడిచింది. ఎనిమిది దశల్లో జరిగిన ఈ ఎన్నికలలో బెంగాల్ లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ తో ఢీ కొట్టడంతో ఇక్కడ హోరాహోరా యుద్ధం నడిచింది.

ఇలాంటి సమయంలో టీఎంసీ గెలుపు ఖరారవడంతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. మధ్యాహ్నం 12 సమయానికి టీఎంసి అధినేత మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గంలో ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారిపై వెనుకంజలో ఉన్నారు. ఇది నిరుత్సాహపరిచే అంశమే అయినా రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖరారవడంతో పార్టీ నేతల్లో ఆనందం కనిపిస్తుంది. అదే సమయంలో గత ఎన్నికలలో కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఇప్పుడు దాదాపు వంద స్థానాలకు చేరువలో అధీక్యంలో ఉండడం ఆ పార్టీలో కూడా ఉత్సాహం కనబరుస్తుంది.