IIIT Placements: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఐదుగురు ఐఐఐటీ విద్యార్థులకు రూ.కోటికి పైగా వేతనం

ఐదుగురు విద్యార్థులు రూ.కోటి పైగా వార్షిక వేతనంతో ప్రముఖ టెక్ సంస్థల్లో ఉద్యోగం సంపాదించినట్లు అలహాబాద్ ఐఐఐటీ అధికారులు వెల్లడించారు

IIIT Placements: క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఐదుగురు ఐఐఐటీ విద్యార్థులకు రూ.కోటికి పైగా వేతనం

Iit

IIIT Placements: విద్యా సంవత్సరం ముగింపుతో దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో “క్యాంపస్ ప్లేస్ మెంట్స్” కోలాహలం నెలకొంది. జాతీయ అంతర్జాతీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలు..సరైన టాలెంట్ కోసం వేటను ప్రారంభించాయి. ఈక్రమంలో అలహాబాద్ ట్రిపుల్ ఐటీ(IIIT, అలహాబాద్)లో జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్ లో, ఎంటెక్ (డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్) విద్యార్థులు..వంద శాతం క్యాంపస్ ప్లేస్ మెంట్స్ సాధించారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు రూ.కోటి పైగా వార్షిక వేతనంతో ప్రముఖ టెక్ సంస్థల్లో ఉద్యోగం సంపాదించినట్లు అలహాబాద్ ఐఐఐటీ అధికారులు వెల్లడించారు. ప్రథమ్ ప్రకాష్ గుప్తా అనే విద్యార్థికి గూగుల్ సంస్థ రూ. 1.4 కోట్ల ప్యాకేజీని అందించగా, అఖిల్ సింగ్‌ అనే విద్యార్థికి రుబ్రిక్ సంస్థ రూ. 1.2 కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది.

other stories: IACS Integrated Programs : ఐఏసీఎస్ లో ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్ ల్లో ప్రవేశాలు

లక్ మిట్టల్, అనురాగ్ మకాడే అనే మరో ఇద్దరు విద్యార్థులకు అమెజాన్ సంస్థ నుండి రూ. 1.25 కోట్లు ప్యాకేజి ఆఫర్ వచ్చింది. ఈసందర్భంగా అలహాబాద్ ఐఐఐటీ పల్స్ మెంట్ ఆఫీసర్ వినీత్ తివారీ మీడియాతో మాట్లాడుతూ..2021 నుంచి అలహాబాద్ ఐఐఐటీలో ఎంటెక్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ కోర్స్ మొదలు పెట్టామని..ఆ కోర్స్ తీసుకున్న విద్యార్థులందరూ క్యాంపస్ ప్లేస్ మెంట్ సాధించినట్టు తెలిపారు.

other stories: Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్‌నెంబర్‌లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు

కాగా గతంలో జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ రికార్డులను తిరగరాస్తూ ఈ ఏడాది వంద శాతం మంది విద్యార్థులు.. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ సాధించారని, అందులోనూ ఐదుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. కోటికి పైగా వార్షిక వేతనం పొందుతున్నారని వినీత్ తివారీ వెల్లడించారు. అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ కోర్స్ కు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని..కోర్స్ ప్రవేశపెట్టిన మొదటి ఏడాదిలోనే క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో 100 శాతం మంది విద్యార్థులకు(161 మంది) పెద్ద సంస్థల్లో ఉద్యాగాలు వచ్చినట్లు వినీత్ వెల్లడించారు.