Stalin Government: స్టాలిన్ మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు వారికి స్థానం

తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక 34 మందితో క్యాబినెట్ కూర్పు పూర్తైంది.. ఈ సారి ఐదుగురు తెలుగువారికి మంత్రి పదవులు దక్కాయి. తమిళనాడులో వివిధ పార్టీల నుంచి 15 మంది తెలుగువారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

Stalin Government: స్టాలిన్ మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు వారికి స్థానం

Stalin Government

Stalin Government:  తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక 34 మందితో మంత్రివర్గ కూర్పు పూర్తైంది.. ఈ సారి ఐదుగురు తెలుగువారికి మంత్రి పదవులు దక్కాయి. తమిళనాడులో వివిధ పార్టీల నుంచి 15 మంది తెలుగువారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. చైన్నైతోపాటు, కోయంబత్తూర్, మరికొన్ని ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉంటారు. తెలుగు ప్రజలు ఉన్న చోట అన్ని పార్టీలు వారికే టికెట్ కేటాయిస్తాయి. దీంతో తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్న ఒకరిద్దరు తెలుగు మంత్రులు ఉండటం పక్కా.. సెల్వం , పాలనిస్వామి ఇలా ఎవరు సీఎం ఉన్నా తెలుగువారికి అవకాశం ఇస్తూనే ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగువారే శాసిస్తారు.

మంత్రి పదవులు దక్కించుకున్న తెలుగు ఎమ్మెల్యేలు

కె కె ఎస్ ఎస్ రామచంద్రన్ – అరుప్పుకొట్టై నియోజకవర్గం ఎమ్మెల్యే .
రెవిన్యూ శాఖ మంత్రి .

ఏ వ వేలు – తిరువణ్ణామలై నియోజకవర్గం.
పీడబ్లుడి శాఖ మంత్రి .

ఆర్ గాంధీ – రాణిపేట నియోజకవర్గం పీడబ్ల్యుడి
టెక్స్టైల్ శాఖ మంత్రి .

కె ఎన్ నెహ్రు – తిరుచ్చి వెస్ట్
మున్సిపల్ శాఖ మంత్రి

పీ కె శేఖర్ బాబు – చెన్నై దురై ముగం .
దేవాదాయ శాఖ మంత్రి …ఉన్నారు..