Jharkhand : భారీ ఎన్‌కౌంట‌ర్‌లో రూ.25లక్షలు రివార్డులున్న మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంట‌ర్ మృతి చెందిన మావోలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.

Jharkhand : భారీ ఎన్‌కౌంట‌ర్‌లో రూ.25లక్షలు రివార్డులున్న మావోయిస్టులు మృతి

five top naxals killed

Jharkhand : జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోల కీలక నేతలు ఉన్నారు. ఈ ఐదుగురిలో ఇద్దరిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరో ఇద్దరు మావోలపై రూ.5లక్షలు రివార్డు ఉందని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన నక్సల్స్ నుంచి పోలీసులు ఏకే 47 తుపాకుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇంకా పలువురు చనిపోయినట్లుగా లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు, సీార్పీఎప్ అధికారులు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.

చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని కంకేర్ జిల్లాలో ఆదివారం (ఏప్రిల్ 2.2023)ముగ్గురు న‌క్స‌లైట్ల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. వీరిలో సుమ‌న్ సింగ్ అంచ‌ల‌, సంజ‌య్ కుమార్ ఉసెండి, ప‌రుశ‌రాం ధ‌నుగ‌ల్ ఉన్నారు. ఈ ముగ్గురిపై పలు కేసులు ఉన్నాయని అద‌న‌పు ఎస్పీ కోమ‌న్ సిన్హా తెలిపారు.

ఛత్రా-పాలం సరిహద్దు ప్రాంతంలో మావో అగ్రనేతలు సమావేశమైనట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. కూంబింగ్ చేపట్టగా వారికి ఎదురుపడిన మావోయిస్టులు.. పోలీసులపైకి కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావం ఉన్న కాంకేర్ జిల్లాలో ముగ్గురు నక్సల్స్‌ను డీఆర్జీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అరెస్టైన మావోయిస్ట్‌లను సుమంద్ అలియాస్ సుమన్ సింగ్ అంచాలా (42), సంజయ్ కుమార్ ఉసెందీ (27), పరాశ్రమ్ ధంగుల్ (55)గా గుర్తించారు.