Demonetisation: నోట్ల రద్దుకు ఐదేళ్లు.. అప్పటికీ, ఇప్పటికీ ఏమైనా మారిందా?

నవంబర్ 8, 2016.. దేశమంతా ఒక్కసారిగా షాక్.. ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు కీలకంగా ప్రకటించారు.

Demonetisation: నోట్ల రద్దుకు ఐదేళ్లు.. అప్పటికీ, ఇప్పటికీ ఏమైనా మారిందా?

Demonitization

Demonetisation: నవంబర్ 8, 2016.. దేశమంతా ఒక్కసారిగా షాక్.. ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు కీలకంగా ప్రకటించారు. ఆరోజు నుంచే రూ.500, రూ.1000 నోట్లు చెలామణిలో ఉండవని చెప్పేయడంతో.. ప్రజలంతా పెద్దనోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు క్యూకట్టారు. ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని బయటకు తీయాలనే ఉద్దేశంతో ప్రధాని ఈ ప్రకటన చేశారంటూ అప్పట్లో కేంద్రప్రభుత్వం చెప్పింది. సరిగ్గా ఈరోజుకు పెద్ద నోట్లు రద్దయ్యి ఐదేళ్లు.

అప్పటికీ, ఇప్పటికీ ఏమైనా మారిందా?
గడిచిన ఐదేళ్లలో నగదు మారకం విషయంలో మార్పులే తప్ప.. బ్లాక్ మనీ.. తదితర విషయాల్లో ఎటువంటి మార్పులు లేవు.. డిజిటల్ చెల్లింపులు మాత్రం గణనీయంగా పుంజుకున్నాయి. డిజిటల్‌ చెల్లింపులతో పోల్చితే లిక్విడ్ క్యాష్ వాడకం మాత్రం బాగా తగ్గింది. ఐదేళ్ల కాలంలోనే డిజిటల్‌ చెల్లింపుల వార్షిక సగటు వృద్ధి 55 శాతం ఉంది. డిజిటల్‌ చెల్లింపులు ఎంతగా పెరిగినా భారత ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగానికే ఇంకా ప్రయారిటీ ఇస్తున్నారు.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం నోట్ల రద్దుకు ముందు రూ.17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉండగా.. అక్టోబరు 29, 2021 నాటికి అవి రూ.29.17లక్షల కోట్లకు పెరిగాయి. కొవిడ్‌-19 కారణంగా ప్రజలు ముందుజాగ్రత్తగా డబ్బును దగ్గర ఉంచుకునేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. చలామణిలో ఉన్న నోట్ల విలువ 64 శాతం పెరిగింది. ఇదే సమయంలో చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 26.88 లక్షల నుంచి 228.96 లక్షలకు చేరింది.

అయితే, డిజిటల్‌ చెల్లింపుల్ని మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే నగదు వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. నగదు ఆధారిత చెల్లింపులుపై పన్నుల భారం పెంచినప్పుడే.. ఖర్చు పెరుగుతుందనే భయంతో ప్రజలు డిజిటల్‌ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా నగదు లావాదేవీలకు పూర్తిగా స్వస్తిపలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.