లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రిపబ్లిక్ డే విన్యాసాలు : చరిత్ర లిఖించనున్న లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్

Updated On - 2:16 pm, Sun, 24 January 21

Flight Lieutenant Swati Rathore : జనవరి 26. భారత గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ పాల్గొని చరిత్ర సృష్టించనున్నారు. తలెత్తుకొనే విధంగా తన కుమార్తె చేసిందని, దీనికి గర్వపడుతున్నట్లు డాక్టర్ భవానీ సింగ్ రాథోర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న రాథోడ్ ఉన్నారు. తమ కలలను సాకారం చేసే విధంగా చూడాలని కూతుళ్లకు చెప్పాలన్నారు.

రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో స్వాతి జన్మించారు. అజ్మీర్ లో పాఠశాల విద్యను కంప్లీట్ చేసింది. పాఠశాలలో నిర్వహించిన పేయింటింగ్ పోటీల్లో పాల్గొన్న స్వాతి..త్రివర్ణ పతాకాన్ని పేయింట్ చేశారు. దేశంపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. కలను సాకారం చేసుకోవాలని తల్లిదండ్రులు ప్రోత్సాహించారు. గ్రాడ్యుయేషన్ అనంతరం ఎన్ సిసి ఎయిర్ వింగ్ లోకి ప్రవేశించింది. పైలట్ కావాలని కలలు కని 2014లో IAFలో తన మొదటి ప్రయత్నానికే ఎంపికయ్యారు. ఆమె సోదరుడు నేవీలో ఉన్నారు.

First Woman

2013లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఎగ్జామ్ లో హాజరయ్యారు. 2014లో డెహ్రడూన్ లోని వైమానిక దళం ఎంపిక బోర్డు…స్వాతిని ఇంటర్వ్యూకు పిలిచింది. దేశం నలుమూలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 98 మంది స్క్రీనింగ్ కోసం ఎంపికయ్యారు. స్ర్కీనింగ్ తర్వాత..కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే మిగిలి ఉన్నారు. అనంతరం ఫ్లైయింగ్ బ్రాంచ్ కు ఎంపికయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్వీట్ చేశారు. వీర భూమి కుమార్తె..కవాతులో ప్లై పాస్ట్ కు నాయకత్వం వహిస్తారనేది మనందరికీ గర్వకారణమని అభివర్ణించారు. ఉజ్వల భవిష్యత్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన కుటుంబానికి, దేశాన్ని గర్వించదగిన విధంగా చేసినందుకు స్వాతికి అభినందనలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.