Flipkart: మహిళలందరిని క్షమాపణలు కోరిన ఫ్లిప్‌కార్ట్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మహిళా లోకాన్ని క్షమాపణలు కోరింది. ఉమెన్స్ డే సందర్భంగా వంటగది వస్తువుల అమ్మకంలో భాగంగా చేసిన ప్రచారంలో దొర్లిన తప్పుపై ఈ నిర్ణయం తీసుకుంది.

Flipkart: మహిళలందరిని క్షమాపణలు కోరిన ఫ్లిప్‌కార్ట్

Flip Kart

Flipkart: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మహిళా లోకాన్ని క్షమాపణలు కోరింది. ఉమెన్స్ డే సందర్భంగా వంటగది వస్తువుల అమ్మకంలో భాగంగా చేసిన ప్రచారంలో దొర్లిన తప్పుపై ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంది సోషల్ మీడియా యూజ్ల నుంచి లింగ వివక్ష చూపిస్తున్నారంటూ కామెంట్లు ఎదుర్కొంది.

‘డియర్ కస్టమర్, ఈ ఉమెన్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోండి. రూ.299 ధరకే గృహోపకరణాలను కొనుగోలు చేయండి’ అంటూ కస్టమర్లందరికీ టెక్స్ట్ మెసేజ్ పంపింది. ఇది కాస్తా నెగెటివ్ ప్రభావం చూపిస్తూ.. సోషల్ మీడియా యూజర్లు మహిళలను వంటగదికే కేటాయిస్తూ ఇలాంటి ప్రమోషన్ చేశారంటూ కామెంట్ చేశారు.

ఫ్లిప్ కార్ట్ చేసిన మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసిన యూజర్ ట్విట్టర్ లో పోస్టు చేసి ఇక్కడ ఏం తప్పు దొర్లిందో గమనించారా అని అడిగిన ట్వీట్ వైరల్ అయి 5వేల లైక్ లు, వందల్లో కామెంట్లు దక్కించుకుంది.

Read Also: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్రం కీలక ఆదేశాలు

ఫ్లిప్ కార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కుకింగ్, కిచెన్ కు మహిళలను కలిపేసినట్లుగా ఉందని అభిప్రాయపడుతున్నారు.