ఉత్తరాఖండ్ ను చుట్టుముట్టిన వరదలు..రిషిగంగ ప్రాజెక్టుపై విరిగిపడ్డ కొండ చరియలు

ఉత్తరాఖండ్ ను చుట్టుముట్టిన వరదలు..రిషిగంగ ప్రాజెక్టుపై విరిగిపడ్డ కొండ చరియలు

Floods in Uttarakhand : ఉత్తరాఖండ్ ను వరదలు చుట్టుముట్టాయి. చమోలీ జిల్లాలో ఒక్కసారిగా ధౌలీగంగ నదీ ప్రవాహం పెరిగింది. తపోవన్ కు సమీపంలో పవర్ ప్రాజెక్టును వరద ముంచెత్తింది. అలకనంద నదిలోనూ భీకరస్థాయిలో వరద ప్రవాహం ఏర్పడింది. రిషిగంగ ప్రాజెక్టుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. పవర్ ప్రాజెక్టు స్వల్పంగా ధ్వంసమైంది.

నదీ పరివాహక ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. అలకనంద నదికి వరద పోటెత్తింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వరదలపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉత్తరాఖండ్ లో వరదలపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు.

హోంశాఖ అధికారులు, ఉత్తరాఖండ్ సీఎస్ తో అమిత్ షా మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. వైమానిక దళాల సహాయం తీసుకోవాలని అమిత్ షా సూచించారు.