మీ వాహనానికి 20 ఏళ్లు నిండాయా..అయితే..అంతే

మీ వాహనానికి 20 ఏళ్లు నిండాయా..అయితే..అంతే

vehicle scrappage policy  : మీ దగ్గరున్న వాహనానికి 20 ఏళ్లు నిండాయా..అయితే..అంతే సంగతులు. తుక్కు కిందకు మార్చే పథకాన్ని తీసుకొస్తోంది కేంద్రం. అందులో భాగంగా కాలం తీరిన వాహనాలను ఇక రోడ్ల మీదకు రావు. కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అయిపోతోంది. అందులో భాగంగా కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా..ఆమె మాట్లాడుతూ…

వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకరానున్నట్లు సభలో ప్రకటించారు. కాలం తీరిన వాహనాలను తుక్కు కిందకు మారుస్తామన్నారు. వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాల లైఫ్‌ టై మ్‌ని 15 ఏళ్లుగా నిర్ధారించారామె. వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు కేటాయించారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.