లాక్ డౌన్ వద్దని అనుకుంటే..నిబంధనలు పాటించాలి – ఉద్దవ్ ఠాక్రే

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 08:49 AM IST
లాక్ డౌన్ వద్దని అనుకుంటే..నిబంధనలు పాటించాలి – ఉద్దవ్ ఠాక్రే

Follow Covid-19 norms – Maharashtra CM : మరోసారి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రజలకు సూచించారు. రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని సలహాలు వచ్చినా..అలాంటి ఆంక్షల ద్వారా ఏదైనా సాధించవచ్చని తాను అనుకోవడం లేదని, అన్ లాక్ ప్రక్రియ ముగిసిందని అనుకోవద్దన్నారు. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు మాస్క్ ధరించాలని చెబుతున్నా..కొంతమంది పాటించడం లేదన్నారు.



ఢిల్లీలో కరోనా వైరస్ విస్తరిస్తోందని, అలాగే అహ్మదాబాద్ లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారని..కానీ లాక్ డౌన్ అక్కర్లేదని..కానీ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని, లాక్ డౌన్ కు వెళ్లాలని అనుకుంటున్నారా ? కోవిడ్ – 19 భద్రతా ప్రమాణాలను పాటించాలా ? అనేది నిర్ణయించుకోవాలన్నారు. బాణాసంచా లేకుండానే దీపావళి పండుగను జరుపుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. అనవసరంగా బయటకు రావొద్దని, ఏదైనా పని మీద బయటకు వస్తే..తప్పని సరిగా మాస్క్ ధరించడమే కాకుండా..భౌతిక దూరం పాటించాలన్నారు.



https://10tv.in/gujarat-people-without-masks-earned-rs-78-crore/
ప్రోటోకాల్ ను పాటించకపోవడం వల్ల..యువత వ్యాధి బారిన పడుతున్నారని, సీనియర్ సిటిజన్లకు ఇన్ ఫెక్షన్ సోకుతోందన్నారు. కుటుంబసభ్యుల కారణంగా వీరు వ్యాధి బారిన పడుతుండడం విచారకరమన్నారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. పాఠశాలల పున:ప్రారంభం విషయంలో సందిగ్ధత నెలకొందన్నారు. నవంబర్ 23వ తేదీ నుంచి 9 నుంచి 12 తరగతుల వారికి పాఠాలు బోధించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది.