ధరించే బట్టలు సూచించే ధర్మాన్ని పాటించండి..యోగిపై ప్రియాంక ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : December 30, 2019 / 11:42 AM IST
ధరించే బట్టలు సూచించే ధర్మాన్ని పాటించండి..యోగిపై ప్రియాంక ఫైర్

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వ ఆస్తులకు నస్టం కలిగిస్తే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిని సీసీటీవీ పుటేజీ ద్వారా గుర్తించి వారి ఆస్తులను వేలం వేసి నష్టపరిహారం భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. చెప్పడమే కాకుండా ఇప్పటికే పలువురికి నోటీసులు పంపించింది యోగి సర్కార్.

ఈ నేపధ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రతీకార చర్యపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. యోగి…ఆయన ధరించే కాషాయ వస్త్రాలకు ప్రతీక అయిన శాంతియుత హిందూ ధర్మాన్ని అనుసరించాలని ప్రియాంక గాంధీ అన్నారు.ఇవాళ(డిసెంబర్-30,2019)లక్నోలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…తనకు తెలిసినంతవరకు చరిత్రలో  పబ్లిక్ పై రివేంజ్ తీర్చుకుంటామనే స్టేట్మెంట్ ఇచ్చిన మొదటి సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ప్రియాంక అన్నారు.

యోగి ఆదిత్యనాథ్ దుస్తులలో ఉండే కాషాయరంగు ఆయనకు చెందినది కాదని, భారతదేశ మత, ఆధ్యాత్మిక సంప్రదాయానికి చెందినదని ఆమె అన్నారు. ఈ రంగు హిందూ ధర్మానికి ప్రతీక, హింస లేదా శత్రుత్వానికి అందులో చోటు లేదని ఆమె అన్నారు. దానిని అనుసరించమని యోగి ఆదిత్యనాథ్‌ను ప్రియాంక కోరారు. ఇవాళ కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ను కలిశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళను చేస్తున్న వారితో ఘర్షణల సమయంలో పోలీసుల పాత్రపై విచారణకు డిమాండ్ చేస్తూ గవర్నర్ కు కాంగ్రెస్ బృందం ఓ మెమోరాండమ్ ను సమర్పించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ కూడా విడిగా గవర్నర్ కు ఓ లేఖ రాశారు. సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతన్న సమయంలో యూపీ పోలీసుల చట్టవిరుద్ధమైన చర్యలపై జ్యుడిషియర్ ఎంక్తైరీ కోరుతూ లేఖ రాశారు.