COVID 19: కరోనా ప్రమాదకరంగా మారకూడదంటే.. పాటించాల్సిన మూడు నియమాలు

కరోనావైరస్ కారణంగా మన జీవన విధానం, సమాజంతో మనకున్న సంబంధాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

10TV Telugu News

COVID 19: కరోనావైరస్ కారణంగా మన జీవన విధానం, సమాజంతో మనకున్న సంబంధాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా దెబ్బకు కుప్పకూలిన వ్యాపారాలు, లక్షల్లో కోల్పోయిన ప్రాణాలు, ఆర్థికంగా కోట్లలో నష్టాలు.. ఎట్టకేలకు కరోనా వైరస్ బారినపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి, ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఎన్నో రకాల సలహాలు, సూచనలు పాటించిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది.

కానీ, కరోనా పరిస్థితులు మాత్రం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనల ప్రకారం కరోనావైరస్ సోకకుండా ఉండడానికి పాటించవలసిన అతి ముఖ్యమైన, ప్రాథమిక సూచన ‘పరిశుభ్రత’. కరోనా రాకుండా ఉండడానికి ఎన్నో సూచనలు డబ్ల్యూహెచ్‌ఓ చేసింది. అయితే, మొదట్లో నియమాలను ప్రజలు పాటించగా.. ఇటీవలికాలంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ప్రస్తుతం మూడు విషయాలను పాటించడం వలన కోవిడ్‌ను నిరోధించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి గత సంవత్సరం కంటే మనం మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాం.. కానీ, వ్యాక్సినేషన్ అందుబాటులో లేని పరిస్థితిలో మనం గడ్డు పరిస్థితిని ఎదర్కొని ఉండేవాళ్లం. అయితే, మూడు ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి.

మూడు నియమాలు:

1) వ్యాక్సినేషన్ ప్రక్రియ:
వ్యాక్సినేషన్ ప్రక్రియ అందుబాటులో ఉన్నప్పటికీ, దాదాపుగా ఫస్ట్ డోస్ చాలా మంది వేయించుకున్నప్పటికీ, సెకండ్ డోస్ వేయించుకోలేదు అని డేటా చెబుతోంది. వైరాలజీ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. కేసులను అరికట్టడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన అంశాల్లో వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమైనది.

వ్యాక్సిన్ మీద ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా కూడా.. వ్యాక్సిన్ ప్రభావం గురించి ఆన్‌లైన్‌లో చాలా తప్పుడు సమాచారం అందుబాటులో ఉందని, వ్యాక్సిన్ అనంతర ప్రభావాల్లో బుతుచక్రాలు మారుతున్నాయని, వంధ్యత్వ సమస్యలు మరియు రక్తం గడ్డకట్టడానికి కారణం అవుతుందనే వాదనలు.. మరెన్నో అపోహలు ఉన్నాయని, అందుకే చాలామంది ప్రజలు కరోనా డోసులను తీసుకోవడం మానేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ సమయంలో, వ్యాక్సిన్ అనేది కరోనా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించే ఆయుధం అని నిపుణులు చెబుతున్నారు.

2) టెస్టింగ్:
కరోనా ముగిసిందనే అపోహలో చాలామంది లక్షణాలు ఉన్నా కూడా టెస్టింగ్ చేయించుకోవట్లేదని, టెస్టింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు నిపుణులు. టెస్టింగ్, మాస్కింగ్ మరియు మెరుగైన ఇండోర్ వెంటిలేషన్ కరోనా రాకుండా చూసుకునేందుకు సాయపడుతాయని, వ్యాక్సిన్‌లతో పాటు, ఎక్కువ మందిని పరీక్షించడం ద్వారా మరియు వారిని అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా క్రియాశీల కేసులను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో కరోనా వ్యాప్తి నుంచి తప్పించుకోవచ్చునని చెబుతున్నారు.

3) రోగనిరోధక శక్తి పెంచుకోవడం:
చాలామందిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని, ఈ సమస్యపై చాలా ప్రాధాన్యత ఇవ్వబడిందని, వైరస్ నుంచి రోగనిరోధక శక్తిని రెండు విధాలుగా మాత్రమే పొందవచ్చు. వ్యాక్సిన్ లేదా సంక్రమణ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మరియు ప్రాణాపాయం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వ్యాక్సిన్లు వేయించుకోవల్సిన జనాభా ఇంకా చాలామంది ఉన్నారని, వారు రోగనిరోధక శక్తి పెంచుకోవల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ మూడు విషయాలు కాకుండా, ప్రజలు సామాజిక దూరం పాటించడం, వీలైనంత వరకు అవసరం లేకుండా ఇంటిలోంచి బయటకు రాకుండా ఉండడం, మాస్క్ ధరించడం మరియు ఆరోగ్యకరమైన పరిశుభ్రత అలవాట్లను పాటించడం చాలా ముఖ్యమని చెప్పారు. మరీ ముఖ్యంగా, పిల్లలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేంత పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.

చేతులను తరచూ సబ్బుతో రుద్దుకుని నీళ్లతో కడుక్కోవడం. లేదా ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ చేతులకు బాగా రుద్దుకోవడం. చేతులపై వైరస్ చేరి ఉంటే ఈ రెండు పద్ధతుల ద్వారా అవి నశిస్తాయి. కళ్లు, ముక్కు, నోరు మాటిమాటికీ ముట్టుకోవడం, తుడుచుకోవడం మానేయాలి. ఒకవేళ మన చేతులపై వైరస్ చేరి ఉంటే కళ్లు, ముక్కు, నోటి ద్వారా ఆ వైరస్ మన శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తుంది.

తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు తప్పనిసరిగా చేతులు అడ్డం పెట్టుకోవాలి లేదా చేతిని లోపలికి మడిచి మోచేతి భాగం ముక్కుకి, నోటికి అడ్డం పెట్టుకోవాలి. టిష్యూ పేపర్లు దగ్గర పెట్టుకుని తుమ్మిన వెంటనే లేదా దగ్గిన వెంటనే వాటిని చెత్తబుటలో వెయ్యాలి. ముక్కు లేదా నోటి ద్వారా రాలే తుంపర్లలో వైరస్ ఉండొచ్చు. వాడిన టిష్యూలను వెంటనే పారెయ్యకపోతే అది ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.