RSS Chief : 40వేల ఏళ్లుగా భారతీయులందరి DNA ఒక్కటే!

40 వేల ఏళ్లుగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. శనివారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో 1000మందికి పైగా ఎక్స్ సర్వీస్ మెన్(మాజీసైనికులు)

RSS Chief : 40వేల ఏళ్లుగా భారతీయులందరి DNA ఒక్కటే!

Rss

RSS Chief : 40 వేల ఏళ్లుగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. శనివారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో 1000మందికి పైగా ఎక్స్ సర్వీస్ మెన్(మాజీసైనికులు) హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40,000 సంవత్సరాల కిందట భారతీయుల డీఎన్ఏ ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉందని భగవత్ అన్నారు. భారతీయుల పూర్వీకులందరూ ఒకరేనని చెప్పారు. వారి వల్లనే దేశం అభివృద్ధి చెందడంతో పాటు సంస్కృతి కొనసాగుతోందన్నారు. ఈ విషయంలో తానేమీ ఆడంబరాలు పలకడంలేదని స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వంపై ఆర్ఎస్ఎస్‌కు పెత్తనం ఏమీ లేదని ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పష్టం చేశారు. వారికి విభిన్న కార్యనిర్వాహకులు విభిన్న సిద్ధాంతాలు, విభిన్నమైన విధానాలు ఉన్నాయన్నారు. సంఘ్ కు సంబంధించి ఆలోచనలు, సంస్కృతి ఎంతో శక్తిమంతమైనవన్నారు. కేంద్రంలో ఉన్న కొందరు ప్రముఖులు సంఘ్ కు చెందినవారేనని, వారెప్పటికీ సంఘ్ వారిగానే కొనసాగుతారని భగవత్ చెప్పారు. ఆ సంబంధం అంతవరకే తప్ప కేంద్రం రిమోట్ కంట్రోల్ సంఘ్ చేతుల్లో ఉంది, కేంద్రాన్ని సంఘ్ నియంత్రిస్తోంది అనడం సరికాదు, అది అవాస్తవం అని అన్నారు.

ఆర్ఎస్ఎస్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని కార్యక్రమానికి హాజరైన వందలాది మంది మాజీసైనికులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా 96 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేస్తోందని చెప్పారు. సమాజంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆర్ఎస్ఎస్ ముందుంటుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ సృష్టం చేశారు.

ALSO READ Covid Vaccination : అండమాన్-నికోబార్ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్