Raj Kundra: పోర్న్ ఫిల్స్మ్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు సుప్రీం కోర్టు రిలీఫ్ | For Businessman Raj Kundra, Supreme Court Relief In Porn Films Racket Case

Raj Kundra: పోర్న్ ఫిల్స్మ్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు సుప్రీం కోర్టు రిలీఫ్

పోర్న్ ఫిల్మ్స్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారి, శిల్పాశెట్టి రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. పొర్నోగ్రఫీ కంటెంట్ ప్రసారాలు, చిత్రీకరణ వంటి...

Raj Kundra: పోర్న్ ఫిల్స్మ్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు సుప్రీం కోర్టు రిలీఫ్

Raj Kundra: పోర్న్ ఫిల్మ్స్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారి, శిల్పాశెట్టి రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. పొర్నోగ్రఫీ కంటెంట్ ప్రసారాలు, చిత్రీకరణ వంటి పలు అంశాలపై ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా నాలుగు వారాల పాటు అరెస్టు అయ్యారు కూడా. మహారాష్ట్ర హైకోర్టు కూడా నోటీసులు ఇష్యూ చేసింది.

బాంబే హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించడంతో శిల్పాశెట్టి భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వీడియోలు శృంగారభరితమైనవి అయినప్పటికీ, వాస్తవానికి ఎటువంటి శారీరక లేదా లైంగిక కార్యకలాపాలను చూపించలేదని కుంద్రా హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అటువంటి వీడియోల చిత్రీకరణలో లేదా ప్రసారంలో తానెప్పుడూ పాల్గొనలేదని చెప్పాడు. ఈ కేసులో తప్పుగా ఇరికించారని పేర్కొన్నారు.

……………………………… : ‘అఖండ’ విజయోత్సవ ర్యాలీలో బాలయ్య

ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కుంద్రాను జులైలో అరెస్టు చేశారు. అదే కేసులో మరో ఐదుగురికి కూడా బెయిల్ రిజెక్ట్ చేసింది హైకోర్టు. అందులో పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా కూడా ఉన్నారు.

సబ్‌స్క్రైబర్ బేస్ యాప్.. Hotshots ఆధారంగా పోర్న్ ఫిల్మ్స్ ప్రసారం చేస్తున్నారని, వాటిని చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఎట్టకేలకు రూ.50వేల పూచీకత్తుపై సెప్టెంబరులో బెయిల్ వచ్చింది.

……………………………….: వజ్రాల వేటకు ఏపీ సర్కార్ ఓకే!

×