Supreme Court Judges: చరిత్రలో తొలిసారి.. తొమ్మిది మంది సుప్రీం జడ్జ్‌ల ప్రమాణ స్వీకారం

చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తులు కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.

Supreme Court Judges: చరిత్రలో తొలిసారి.. తొమ్మిది మంది సుప్రీం జడ్జ్‌ల ప్రమాణ స్వీకారం

Judges

Supreme Court Judges: చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తులు కలిసి ప్రమాణ స్వీకారం చేశారు, దీంతో ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుకుంది. సుప్రీంకోర్టు చరిత్రలో మొదటిసారిగా, తొమ్మిది మంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసినట్లుగా సుప్రీంకోర్టు వ్యవహారాలకు సంబంధించిన అధికారులు వెల్లడించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వారందరితో ప్రమాణం చేయించగా.. ప్రమాణం చేసిన వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.

సుప్రీంకోర్టుతో పాటు భవన సముదాయంలోని ఆడిటోరియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి కోర్టు గదిలో కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయడం ఇప్పటి వరకు సాంప్రదాయంగా ఉంది. ప్రమాణస్వీకార కార్యక్రమం DD న్యూస్, DD ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇది కాకుండా, సుప్రీంకోర్టు అధికారిక వెబ్ పోర్టల్ హోమ్ పేజీలో కూడా ఇందుకు సంంబంధించిన కార్యక్రమం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీఎస్‌ నరసింహా న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం జడ్జిగా నియమితులయ్యారు. అయోధ్య సహా పలు సంచలన, ముఖ్యమైన కేసుల్లో ఆయన తన వాదనలు వినిపించారు. అలాగే, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా త్రివేది సహా.. జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.

వాస్తవానికి 1956లో తీసుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి 2009లో సవరణలు తీసుకుని వచ్చారు. అప్పుడు సీజేఐతో కాకుండా న్యాయమూర్తుల సంఖ్యను 25 నుంచి 30కి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే కేబినెట్ నుంచి అప్పట్లో నిర్ణయం వచ్చింది.