Amith Shah : మోదీ మళ్లీ ప్రధాని కావాలంటే యోగి సీఎం కావాల్సిందే

2024లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు నాంది కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో

Amith Shah : మోదీ మళ్లీ ప్రధాని కావాలంటే యోగి సీఎం కావాల్సిందే

Amith

Amith Shah  2024లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు నాంది కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం అమిత్ షా పర్యటించారు. లక్నోలోని అవధ్​ ప్రాంతంలోని డిఫెన్స్​ ఎక్స్​పో గ్రౌండ్ లో ఇవాళ జరిగిన బీజేపీ సభ్యత్వ విస్తరణ ప్రారంభ కార్యక్రమంలో షా పాల్గొన్నారు.

అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..2024లో మోదీ మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలంటే… ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్​ మళ్లీ ఎన్నిక కావాలన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ.. ఉత్తర్​ప్రదేశ్​కు ఏమేం అవసరమో అన్నీ అందించారన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్లేందుకు తమకు మరో ఐదు సంవత్సరాలు అవసరమన్నారు. ఇది రాముడు, మహదవ్, కృష్ణుడు, కబీర్, బుద్ధుడు, సుహల్‌దేవ్, మదన్ మోహన్ మాలవీయ పుట్టిన గడ్డ. ఇప్పుడు ఈ గడ్డ అభివృద్ధి బాట పట్టింది. అభివృద్ధి అనేది ఒక కుటుంబానికో, ఒక కులానికో పరిమితం కాకుండా అందరికీ చేరుతోంది. ముఖ్యంగా అత్యంత నిరుపేదల కోసం అభివృద్ధిని ఉద్దేశించామని షా అన్నారు

నాలుగు కోట్ల సభ్యత్వాలు లక్ష్యంగా చేపట్టిన ”మేరా పరివార్-బీజేపీ పరివార్” ప్రచారం ఈనెల 29 నుంచి డిసెంబర్ 31 వరకూ జరుగుతుందని, పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగించాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. 300కు పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను భరత​ మాతను విశ్వగురువుగా తయారు చేసేందుకు జరిగే ఎన్నికలుగా అమిత్ షా అభివర్ణించారు.

దీపావళి తర్వాత పార్టీ ప్రచారం ఊపందుకుంటుందని… దానికోసం కార్యకర్తలంతా అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టో ఉంటుందని,2017లో ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం నెరవేర్చామని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ గణనీయమైన పురోగతిని సాధించిందని.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో మాఫియాను నిర్మూలించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రశంసించారు.

బీజేపీ కార్యకర్తలు తమ జెండాలతో బయటకు అడుగుపెట్టడం చూసి ప్రతిపక్షాలు బెదిరిపోతున్నాయని అన్నారు. ఎన్నికల నగారా మోగగానే ఇంట్లో కూర్చున్న నేతలు కొత్త చొక్కాలు వేసుకుని బయటకు వస్తున్నారని ప్రతిపక్ష నేతలపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్ని రోజుల విదేశాల్లో ఉన్నారో యూపీ ప్రజలకు సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్ సమాధానం చెప్పాలని షా ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో మరియు వరదలు వచ్చినప్పుడు అఖిలేష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

యూపీలో గత ప్రభుత్వాలు…వారి కోసం, వారి కుటుంబాల కోసమే పరిపాలన చేశారు. వారికి ఇంకా ఏమైనా విస్తృతమైన ఆలోచన ఉంటే.. అది వారి సామాజిక వర్గం కోసం తప్పిస్తే.. ఇంకా ఎవరి కోసం కాదని ప్రతిపక్షాలను అమిత్ షా విమర్శించారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే, ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ అభివృద్ధిని పట్టాల మీదకు తీసుకువచ్చిందని ప్రశంసించారు. అయోధ్యలో రామందిర నిర్మాణానికి తామే పునాది వేశామని చెప్పారు. ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ 24 క్యారెట్ల బంగారం అని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కొనియాడారు. మోదీపై చిన్న అవినీతి మచ్చ కూడా లేదన్నారు. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాధినేతగా మోదీ ప్రస్థానాన్ని మేనేజ్​మెంట్​ పాఠశాలల్లో సమర్థమైన నాయకత్వం, సమర్థమైన పాలన అనే అంశాలపై కేస్​ స్టడీగా బోధించాలన్నారు.

ALSO READ DGCA: అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు.. ఎప్పటివరకంటే?