Mumbai Court : భార్యతో బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదు

భార్యకు ఇష్టం లేకుండా..శృంగారం జరపడం చట్ట విరుద్ధమా ? ఆమెను బలవంతం పెట్టడం సరికాదా ? ఈ విషయంలో పలు కోర్టులు తీర్పులను వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే...తాజాగా..ముంబై అడిషనల్ సెషన్స్ కోర్టు విరుద్ధమైన తీర్పునివ్వడంపై హాట్ హాట్ చర్చలు ప్రారంభమయ్యాయి. తనకిష్టం లేకుండా..శృంగారం జరుపుతున్నాడని ఓ భార్య..భర్తపై కంప్లైట్ చేసింది.

Mumbai Court : భార్యతో బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదు

Forced Sex

Forced Sex : భార్యకు ఇష్టం లేకుండా..శృంగారం జరపడం చట్ట విరుద్ధమా ? ఆమెను బలవంతం పెట్టడం సరికాదా ? ఈ విషయంలో పలు కోర్టులు తీర్పులను వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే…తాజాగా..ముంబై అడిషనల్ సెషన్స్ కోర్టు విరుద్ధమైన తీర్పునివ్వడంపై హాట్ హాట్ చర్చలు ప్రారంభమయ్యాయి. తనకిష్టం లేకుండా..శృంగారం జరుపుతున్నాడని ఓ భార్య..భర్తపై కంప్లైట్ చేసింది. చివరకు ఇది కోర్టు మెట్లు ఎక్కింది. బలవంతపు శృంగారం ఎంత మాత్రం చట్ట విరుద్ధం కాదని..ఆమెతో శృంగారంలో పాల్గొన్నది భర్తే కావడం వల్ల…చట్టం ముందు నిలబడదని చెప్పింది.

Read More : ENG vs IND : ఆసక్తికరంగా రెండో టెస్ట్, భారత బౌలర్లు రాణిస్తారా ?

అసలేం జరిగింది ?

మహారాష్ట్రకు చెందిన ఓ వివాహిత..గత నవంబర్ 22న పైళ్లైంది. వివాహామైన కొన్ని రోజులకే అత్తింటి వారు అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా..తనపై ఆంక్షలను కూడా విధించారని చెప్పుకొచ్చారు. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత…తన ఇష్టానికి వ్యతిరేకంగా…భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొన్నారని, జనవరి నెలలో ఓ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కూడా…బలవంతంగా శృంగారం చేశాడని ఆరోపించారు.

Read More : Sonia Gandhi: విపక్షాలతో సోనియా భేటీ.. ఆగష్టు 20న ముహూర్తం!

అప్పటి నుంచి తనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, వైద్యులను సంప్రదిస్తే..తన నడుం కింది భాగం పక్షవాతానికి గురైందని వారు వెల్లడించారని వివాహిత పేర్కొన్నారు. భర్త వల్లే తనకు ఈ సమస్య వచ్చిందంటూ..సదరు మహిళ…పోలీసులకు ఫిర్యాదు చేసారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ…అడిషనల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు అత్తామామలు. వరకట్నం కోసం తాము ఎప్పుడూ వేధించలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు జడ్జీ సంజశ్రీ ఘరాత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More : Covid wave: కరోనా సెకండ్ వేవ్ ముగియలేదు, మూడో వేవ్ ఎప్పుడొస్తుంది? ఎందుకు?

చిన్న వయస్సులోనే పక్షవాతానికి గురి కావడం బాధకరమే అయినా..దీనికి భర్తే కారణమని చెప్పడం సరైంది కాదన్నారు. పెళ్లి తర్వాత…భార్యతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొన్నా…అది చట్ట విరుద్ధం కాదని వెల్లడించారు. అదనపు కట్నం కోసం వేధించారన్న చెబుతున్న మహిళ..ఎంత డిమాండ్ చేశారనే విషయం వెల్లడించడం లేదన్నారు.