Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

ల్లీ లిక్కర్ స్కాంలో గత నెల చివరిలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనీశ్ సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. శనివారం అతడి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ కస్టడీని పొడిగించింది. సీబీఐ అధికారులు తమ కస్టడీలో సిసోడియాను విచారిస్తున్నారు.

Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

Manish Sisodia: సీబీఐ కస్టడీలో భాగంగా జైళ్లో ఉన్న మనీశ్ సిసోడియాను బెదిరించి, తప్పుడు ఆరోపణల పత్రాలపై సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జైల్లో అతడిని మానసికంగా వేధించి, ఒత్తిడి తెస్తున్నారని ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.

Crude Oil Import: రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు దిగుమతులు.. రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత నెల చివరిలో మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనీశ్ సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. శనివారం అతడి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. సీబీఐ కస్టడీని పొడిగించింది. సీబీఐ అధికారులు తమ కస్టడీలో సిసోడియాను విచారిస్తున్నారు. ఈ అంశంపై సౌరభ్‌తోపాటు ఆప్ నేతలు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సౌరభ్ మాట్లాడుతూ ‘‘మనీశ్‌కు వ్యతిరేకంగా సీబీఐ వద్ద సరైన ఆధారాలు లేవు. అందుకే అతడ్ని హింసిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కోర్టుకు కూడా తెలిపాడు’’ అని వ్యాఖ్యానించారు. కోర్టులో విచారణ సందర్భంగా సిసోడియా సీబీఐపై ఆరోపణలు చేశారు.

Zoom layoffs: ప్రెసిడెంట్‌కు షాకిచ్చిన ‘జూమ్’.. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడి తొలగింపు

సీబీఐ తనను మానసికంగా వేధిస్తోందన్నారు. ‘‘సీబీఐ అధికారులు నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లేదు. కానీ, 8-9 గంటలు కూర్చోబెట్టి, అవే ప్రశ్నలు మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ఇలా మానసిక హింసకు గురి చేస్తున్నారు’’ అని సిసోడియా సీబీఐ కోర్టుకు తెలిపారు. దీనిపై జడ్జి నాగ్‌పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి అడిగిన ప్రశ్నను మళ్లీ మళ్లీ అడిగి, సిసోడియాను విసిగించొద్దని సీబీఐ అధికారులకు సూచించారు. కొత్త ప్రశ్నలు ఉంటేనే అడగాలని సూచించారు.