ఆన్ లైన్ క్లాసుల కోసం 50 కిలోమీటర్ల ప్రయాణం..ఇంటర్నెట్ కావాలని బాలుడు లేఖ

  • Published By: madhu ,Published On : August 23, 2020 / 06:38 AM IST
ఆన్ లైన్ క్లాసుల కోసం 50 కిలోమీటర్ల ప్రయాణం..ఇంటర్నెట్ కావాలని బాలుడు లేఖ

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహస్తున్నారు. కొంతమంది విద్యార్థులు క్లాసుల్లో పాల్గొనడానికి ఏకంగా ప్రతి రోజు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. తుఫాన్ కారణంగా నిలిచిపోయిన ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని బాలుడు కోరడంతో అందరూ ఆశ్చర్యపోయే ఈ విషయం వెలుగు చూసింది.

చదువుపై వారికున్న శ్రద్ధను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర జిల్లాలోని రత్నగిరి తీర ప్రాంతాలకు చెందిన ఓ మారుమూల గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన 200 మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు. ఇటీవలే భారీ వర్షాలు కురుస్తుండడంతో రత్నగిరి తీర ప్రాంత జిల్లాల్లో వరద నీరు పోటెత్తడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో సెల్ టవర్ లు పని చేయకపోవడం, ఇంటర్ నెట్ సౌకర్యం నిలిచిపోయింది.

స్కూల్ టీచర్లు ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ కంపల్సరీ అని చెప్పడంతో 200 మంది విద్యార్థులు ప్రతి రోజు 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. ఓ బాలుడు అధికారులకు లేఖ రాయడంతో ఈ విషయం బయటపడింది.

శిశు హక్కుల సంఘం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఛైల్డ్ రైట్స్ (NCPCR)కు ఫిర్యాదు చేశారు. దీని ద్వారా ఇంటర్ నెట్ కనెక్షన్లను పునరుద్ధరించవచ్చని వెల్లడిస్తున్నారు.