S Jaishankar : చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ

భారత్-చైనా విదేశాంగశాఖ మంత్రులు బుధవారం భేటీ అయ్యారు.

S Jaishankar : చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ

Foriegn Minister

S Jaishankar భారత్-చైనా విదేశాంగశాఖ మంత్రులు బుధవారం భేటీ అయ్యారు. తజకిస్తాన్ లో జరుగుతున్న షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జై శంకర్..చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ తో సమావేశమయ్యారు. దాదాపు గంటల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది.

ప్రధానంగా వాస్తవాధీన రేఖ(LAC)వద్ద అపరిషృతంగా ఉన్న సమస్యలపైనే సమావేశంలో చర్చించినట్లు జై శంకర్ అనంతరం ఓ ట్వీట్ లో తెలిపారు. దాదాపు గంట పాటు తమ భేటీ జరిగినట్లు తెలిపారు. సరిహద్దుల వద్ద యథాతథ స్థితి యొక్క మార్పు ఆమోదయోగ్యం కాదని చైనా మంత్రికి చెప్పినట్లు జై శంకర్ చెప్పారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతత యొక్క పూర్తి పునరుద్ధరణ మరియు నిర్వహణ.. ఇరు దేశాల సంబంధాల అభివృద్ధికి అవసరమని జై శంకర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. సరిహద్దుల్లో అపరిషృత సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సీనియర్ మిలటరీ కమాండర్ ల మధ్య త్వరలో భేటీకి అంగీకరించినట్లు జై శంకర్ చెప్పారు.