సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూత

సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా కన్నుమూత

Former CBI director Ranjit Sinha

Former CBI director Ranjit Sinha: సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్(CBI) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఢిల్లీలో మరణించారు. 68 ఏళ్ల సిన్హా శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. సీబీఐ డైరెక్టర్‌గా, ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్(ITBP) డీజీ సహా వివిధ సీనియర్ పదవులను నిర్వహించిన 1974 బ్యాచ్ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి రంజిత్ సిన్హా.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సీబీఐ కేసుల్లో కూడా చిక్కుకున్నారు రంజీత్ సిన్హా. సీబీఐ డైరెక్టర్ పదవిలో ఉన్న సమయంలో బొగ్గు కేటాయింపు కుంభకోణంపై దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

సిన్హా పాత్ర అనుమానాస్పదంగా ఉందని, దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించగా.. ఉత్తర్వు వచ్చిన మూడు నెలల తరువాత సిన్హాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రంజిత్ సిన్హా 2012 మరియు 2014 మధ్య రెండేళ్లపాటు సిబిఐ డైరెక్టర్‌గా ఉన్నారు.