Gautam Gambhir : గౌతం గంభీర్‌ను చంపుతామంటూ బెదిరింపులు

భారత మాజీ క్రికెటర్.. బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ను చంపుతామని ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

10TV Telugu News

Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్.. బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ను చంపుతామని ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు ఎంపీ. ఈ మెయిల్ రూపంలో తనకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు తెలిపారు గంభీర్. కాగా బెదిరింపులకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

చదవండి : Gautam Gambhir: అక్రమంగా మెడిసిన్ నిల్వ.. సుప్రీంకోర్టులో గంభీర్ కు ఎదురుదెబ్బ

గంభీర్ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గంభీర్ ఫిర్యాదుపై ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహన్ స్పందించారు. ఫిర్యాదుపై తాము దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

చదవండి : Gautam Gambhir : గంభీర్ గొప్ప మనస్సు.. తూర్పు ఢిల్లీలో ఫ్రీ కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులు

కాగా 15 ఏళ్ళు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గంభీర్ 2018 రిటైర్మెంట్ ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా గంభీర్‌కు గతంలో కూడా ఎటువంటి బెదిరింపులు వచ్చాయి.