Keerthi Azad : తృణమూల్ గూటికి మాజీ క్రికెటర్

1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.. కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ తీర్థం పుచ్చుకోనున్నారు ఆజాద్

Keerthi Azad : తృణమూల్ గూటికి మాజీ క్రికెటర్

Keerthi Azad

Keerthi Azad : 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.. కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీహార్‌కి చెందిన ఆజాద్ దర్బంగా స్థానం నుంచి మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. గతంలో బీజేపీలో ఉన్న ఆజాద్.. దివంగత మాజీ మంత్రి అరుణ్ జైట్లీ.. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆజాద్ ఆరోపణలు చేయడంతో బీజేపీ ఆయనను సస్పెండ్ చేసింది.

చదవండి : TMC: విజయఢంకా మోగించిన దీదీ.. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌కి రాజీనామా చేయనున్నారు ఆజాద్.. బీహార్‌లో కాంగ్రెస్ ప్రభావం రోజు రోజుకు తగ్గిపోతుండటంతో ఆయన తృణమూల్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కీర్తి ఆజాద్‌తో పాటు కాంగ్రెస్ నేత అశోక్ త‌న్వ‌ర్ టీఎంసీలో చేర‌నున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌మ‌క్షంలో కీర్తి ఆజాద్ టీఎంసీలో చేర‌నున్నారు.

చదవండి : TMC In Goa : గోవాపై టీఎంసీ కన్ను..రంగంలోకి పీకే..రా రమ్మంటున్న సీఎం సావంత్

వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనుండటంతో టీఎంసీ వడివడిగా అడుగులు వేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డారు మమతా. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లోని కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. టీఎంసీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొని అడుగులు వేస్తున్నారు మమతా.. ఈ నేపథ్యంలోనే వివాద పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది.