రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు స్వల్పగాయాలు

రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు స్వల్పగాయాలు

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మాధోపూర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మహ్మద్ అజారుద్దీన్ వాహనం బోల్తా పడగా.. పెను ప్రమాదం నుంచి అజారుద్దీన్ తృటిలో బయటపడ్డాడు. లాల్సోట్ కోటా మెగా హైవేలోని సుర్వాల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

మాజీ క్రికెటర్ కుటుంబంతో పాటు రణతంబోర్ వస్తుండగా.. అజారుద్దీన్‌ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అజీరుద్దీన్‌తో పాటు వస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో అజారుద్దీన్‌కు స్వల్పగాయాలైనట్లు తెలుస్తుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు. అజారుద్దీన్‌ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు.

టైరు పేల‌డం వ‌ల్లే అజారుద్దీన్‌ ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పిన‌ట్లుగా తెలుస్తోంది. రోడ్డు ప‌క్క‌న ఉన్న దాబాలోకి కారు దూసుకెళ్లగా.. ఈ ప్ర‌మాదంలో అజార్ కుటుంబ‌స‌భ్యులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డగా.. దాబాలో ప‌నిచేస్తున్న ఇషాన్ అనే వ్య‌క్తి గాయ‌ప‌డ్డాడు.