Satyender Jain : ఆసుపత్రిలో ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ .. ఐసీయూలో చికిత్స
తీహార్ జైన్ జైల్లోని బాత్రూమ్ లో కుప్పకూలిపోయిన మాజీ మంత్రి జైన్ ను ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్సపొందుతున్నారు.

Satyender Jain IN LNJP hospital ICU
Satyender Jain In LNJP Hospital : మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినప్పటినుంచి తీహార్ జైలులో ఉంటున్న మాజీ మంత్రి సత్యేందర్ ఆరోగ్యం క్షీణించింది. ఈక్రమంలో జైన్ జైల్లోని బాత్రూమ్ లో కుప్పకూలిపోయారు. దీంతో జైలు సిబ్బంది అధికారుల ఆదేశంలో జైన్ ను ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్టుపై సత్యేందర్ జైన్ చికిత్సనందిస్తున్నారు ఆస్పత్రి డాక్టర్లు.
తీహార్ జైలులోని బాత్‌రూంలో గురువారం ఉదయం ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) కుప్పకూలిన అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్సను అందించేందుకు ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందించారు.
కాగా జైల్లో ఉంటున్న జైన్ మానసికంగా శారీరకంగా కృంగిపోయారు. ‘ఒంటరితనం వల్ల ఆందోళనకు గురవుతున్నాను. నేనుంటున్న గదిలో ఇద్దరు వ్యక్తుల్ని నాకు తోడుగా ఉంచాలని కోరుతున్నా’’ అంటూ మే 11న జైలు అధికారులకు లేఖ రాశారు. దీంతో జైలు సూపరింటెండెంట్ ఇద్దరు ఖైదీలను ఆయన గదికి బదిలీ చేశారు. ఇదికాస్తా వివాదమైన సంగతి తెలిసిందే.
కాగా..జైల్లో ఉంటున్న జైన్ తరచు ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలిస్తున్నారు. అలా ఇది రెండోసారి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లటం. తీహార్ జైల్లోని సెల్ నంబర్ 7లో జైన్ ఉంటున్నారు. ఈక్రమంలో ఆయన ఉదయం ఆరు గంటల సమయంలో బాత్రూకు వెళ్లగా అక్కడే కుప్పకూలిపోయారు. ఈ విషయాన్ని తీహార్ జైల్ డీజీ తెలిపారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. సత్యేందర్ జైన్‌కు వెన్నెముక సర్జరీ చేయాల్సి ఉందని..ఆయన వెన్నునొప్పితో పాటు ఎడమ కాలు, భుజం నొప్పితో బాధపడుతున్నారని వెల్లడించారు.
మనీ ల్యాండరింగ్ కేసులో గత ఏడాది ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పటి నుంచి సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని..ఆయన స్లీప్ అప్నియాతో బాధపడుతున్నాయని ఆప్ వర్గాలు పేర్కొన్నారు.ఆయన్ని చూడటానికి తాము వెళ్లిన సమయంలో ఆస్పత్రిలో నడుముకు బెల్టు కట్టుకుని కనిపించారని తెలిపాయి.
Satyendar Jain Video: ఇది జైలు కాదు.. రిసార్ట్..! జైలు నుంచి సత్యేంద్ర జైన్ మరో వీడియో విడుదల