కాంగ్రెస్-జేడీఎస్ మాటల యుద్ధం..సిద్దూ వ్యాఖ్య లపై దేవెగౌడ సీరియస్

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2019 / 02:54 PM IST
కాంగ్రెస్-జేడీఎస్ మాటల యుద్ధం..సిద్దూ వ్యాఖ్య లపై దేవెగౌడ సీరియస్

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ప్రధానమంత్రి  దేవెగౌడపై ఇవాళ ఉదయం కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య సంచల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  దేవెగౌడ కుటుంబంలా తాను రాజకీయాలు చేయలేదని, దేవెగౌడ ఎవ్వరినీ ఎదగనివ్వడంటూ సిద్దూ చేసిన పలు సంచలన వ్యాఖ్యలపై దేవెగౌడ ఘూటుగా స్పందించారు.

సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి సిద్దరామయ్యే కారణమన్నారు. ఇలా జరుగుతందని ముందే తెలుసన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎలాంటి వాళ్లే తనకు ముందే తెలుసునన్నారు. అయితే ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ తో ఎందుకు చేతులు కలిపారన్న ప్రశ్నకు…తాము మెదటి నుంచి సెక్యులర్ భావజాలం కలిగా ఉన్నామని,సోనియాగాంధీ చెప్పిందనే కాంగ్రెస్ తో చేతులు కలిపి సర్కార్ ఏర్పాటు చేశామన్నారు. సిద్దరామయ్య సర్టిఫికెట్ తనకు అవసరం లేదన్నారు. రాజకీయాలు తెలియకపోవడానికి తానే పిసి బాలుడిని కాదన్నారు.

కుమారస్వామి సీఎంగా ఉండటాన్ని సిద్దరామయ్య సహించలేకపోయారన్నారు. రైతు రుణమాఫీ సమయంలో..మీ నాన్న వల్లే కాలేదు నీ వల్ల ఏమి అవుతుందంటూ కుమారస్వామిని టార్గెట్ చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇద్దరు కాంగ్రెస్ జాతీయ నాయకులు తన ఇంటికి వచ్చి సీఎంగా మొదట మల్లిఖార్జున ఖర్గే పేరు ప్రతిపాదించినప్పుడు సిద్దూ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారి,కుమారస్వామి పేరు ప్రతిపాదించినప్పుడు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చున్నాడని,కుమారస్వామిని 5ఏళ్లు సీఎం సీటులో ఉంచరని తనకు అప్పుడే అర్థమైందన్నారు.

సిద్దూ సీఎంగా ఉన్న 5సంవత్సరాల కాలంలో మీ నాన్న వచ్చినా కూడా సీఎం కాలేడంటూ కుమారస్వామిపై విమర్శలు చేశారన్నారు. అలాంటిది సీఎం సీటులో కుమారస్వామి సీటులో కూర్చోగానే సిద్దూ సహించలేకపోయాడన్నారు. సిద్దరామయ్య ఎప్పుడూ యడియూరప్పను ఎటాక్ చేయలేదని,ఎల్లప్పుడూ కుమారస్వామిని టార్గెట్ చేశారన్నారు. 14నెలల సంకీర్ణ సర్కార్ లో కుమారస్వామి పడిన కష్టం తనకు తెలుసున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తన మనవడు నిఖిల్ గౌడ ఓటమికి సిద్దరామయ్యే కారణమన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  మండ్య నుంచి పోటీ చేసిన కుమారస్వామి కొడుకు,తుముకూరు నుంచి పోటీ చేసిన దేవెగౌడ ఓడిపోయిన విషయం తెలిసిందే.