Gayatri Prajapati: రేప్ కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు..

యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. సామూహిక అత్యాచారం కేసులో కోర్టు యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి జీవితఖైదు విధించింది.

Gayatri Prajapati: రేప్ కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు..

Prajapati

Gayatri Prajapati: యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. సామూహిక అత్యాచారం కేసులో కోర్టు యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి జీవితఖైదు విధించింది. లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం మాజీ మంత్రి ప్రజాపతితో పాటు మరో ఇద్దరు ఆశిష్ శుక్లా, అశోక్ తివారీలను దోషులుగా పరిగణిస్తూ జీవిత ఖైదు విధించింది. జరిమానాగా రెండు లక్షల రూపాయలు కట్టాలని ఆదేశించింది.

నిందితులైన వికాశ్‌ వర్మ, రూపేశ్వర్‌, అమరేంద్ర సింగ్‌ అలియాస్‌ పింటూ, చంద్రపాల్‌పై సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్ధోషులుగా విడుదల చేసింది. కేసు విచారణలో భాగంగా మొత్తం 17 మంది సాక్షులను విచారించారు.

మాజీమంత్రితో పాటు ఆరుగురు అనుచరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చిత్రకూట్‌కు చెందిన ఓ మహిళ 2017 ఫిబ్రవరి 18న యూపీ పోలీసులకు కంప్లైంట్ చేసింది.  మైనింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి తాను పని కోసం లక్నోలోని అధికారిక నివాసానికి వెళ్లినప్పుడు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. తన కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపించింది.

…………………………………… : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..బస్సులోకి అనుమతి లేదు

పోలీసులు కేసులో నిర్లక్ష్యం వహించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదై అనంతరం 2017 మార్చి 15న మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న అతనికి శనివారం శిక్ష మంజూరు చేశారు.

గత ప్రభుత్వంలో గాయత్రి ప్రజాపతి ఉత్తరప్రదేశ్‌లో రవాణా, మైనింగ్‌ శాఖలకు మంత్రిగా పని చేశారు.