Gujarat : కలుషిత నీరు తాగి నలుగురు మృతి..72 మందికి అస్వస్థత

Gujarat : కలుషిత నీరు తాగి నలుగురు మృతి..72 మందికి అస్వస్థత

Gujarat

Tragedy in gutter Gujarat : కలుషితమైన నీరు త్రాగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. మరో 72మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. సూరత్‌ సమీపంలోని కఠోర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై సూరత్‌ మున్సిపల్‌ అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల విచారణలో తాగునీటి పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలిసిందనీ..ఆ నీరు తాగిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కలుషిత నీరు ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన ఈ విషాదరకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కఠోర్‌ గ్రామంలో కలుషిత నీరు తాగిన అస్వస్థతకు గురైనవారికి వాంతులు.. విరేచనాలు అయ్యాయి. దీంతో వారు నీరసించిపోయారు.వాంతులు విరేచినాలు ఒకేసారి అవ్వటంతో వారిలో చాలామంది శోష వచ్చి పడిపోయారు. దీంతో బాధితులంతా ఆసుపత్రి బాట పట్టటంతో సమీపంలోని ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. ఇంకా బెడ్స్ సరిపోక ఒక్కో బెడ్ మీద ఇద్దరు నుంచి నలుగురినికూడా పడుకోబెట్టి చికిత్సనందించారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దవారితో సహా చిన్నారులు కూడా అస్వస్థతకు గురైనవారిలో ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారు గెమల్‌ వాసవ అనే 45 ఏళ్ల వ్యక్తి, హరీశ్‌ రాథోడ్‌ (42), మోహన్‌ రాథోడ్‌ (70) విజయ్‌ సోలంకి (38). చిన్నారులు అకస్మాత్తుగా నీరసంతో స్పృహ తప్పి పడిపోయారు కిందపడిపోయారు.

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో పాటు కఠోర్ గ్రామంలోని ప్రజలందరికీ అధికారులు ముందస్తుగా ఓఆర్‌ఎస్‌ పాకెట్లు పంపించారు. 250 నివాస ప్రాంతాలకు ఈ కలుషిత నీరు సరఫరా అయ్యిందని అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్ని చేపట్టారు. వెంటనే డ్రైనేజీ నీటి పైపును తొలగించి స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.