Nirmala on Adani: అదానీ వివాదంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది. ఇప్పటికే దేశీయంగా స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక వచ్చి రోజులు గడుస్తున్నప్పటికి.. అదానీ గ్రూప్ షేర్ల పతనం మాత్రం ఆగడం లేదు.

Nirmala on Adani: అదానీ వివాదంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

FPOs come and go, regulators doing their job.. FM on Adani Group stock rout

Nirmala on Adani: హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్‌ అతి తక్కువ కాలంలో లక్షల కోట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అదానీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగిందని, దీనిపై ప్రభుత్వం విచారణ చేయాలంటూ పార్లమెంటులో రెండు రోజులు హైడ్రామా కొనసాగింది. ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకుని ఈ నెల చివరి నుంచి విచారణ జరపున్నట్లు పేర్కొంది. ఇకపోతే, ఈ నెల 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలోనే అదానీ వివాదంపై స్పందించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ ప్రసంగం మధ్యలో విపక్షలు నినాదాలు చేశాయి. అయితే అప్పుడు మౌనం వహించిన నిర్మలా శనివారం ఈ విషయమై ప్రత్యేకంగా సమాధానం చెప్పారు.

Supreme Court: ఏ కేసూ కోర్టుకు పెద్దది కాదు, చిన్నదీ కాదు.. సీజేఐ చంద్రచూడ్

నిర్మల స్పందిస్తూ ‘‘నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయి. దీనిపై నిన్న రిజర్వ్‌ బ్యాంకు చెప్పిన మాటలు విన్నాం. దీనికంటే ముందు బ్యాంకులు, ఎల్‌ఐసీ స్పందించాయి. నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ప్రభుత్వంతో వాటికి ఎలాంటి సంబంధం ఉండదు, వాటిపై ప్రభుత్వం ఒత్తిడి కూడా ఉండదు. మార్కెట్లను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాయి. సెబీ ఆ పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తుంది’’ అని అన్నారు. అలాగే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 20,000 కోట్ల రూపాయల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌‭ను ఉపసంహరించుకోవడంపై ఎదురైన ప్రశ్నలను ఆమె తోసిపుచ్చారు. గతంలోనూ ఎఫ్‌పీఓలను ఉపసంహరించుకున్న ఉదంతాలు ఉన్నాయని నిర్మల అన్నారు.

Pakistan Crisis: కుడి చేతిలో ఖురాన్, ఎడమ చేతిలో అణుబాంబ్.. పాక్ నేత సంచలన వ్యాఖ్యలు

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో నష్టాలను చూస్తున్న అదానీ కంపెనీ.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఇబ్బందులు ఎదుర్కోంటోంది. ఇప్పటికే దేశీయంగా స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక వచ్చి రోజులు గడుస్తున్నప్పటికి.. అదానీ గ్రూప్ షేర్ల పతనం మాత్రం ఆగడం లేదు. అదానీ గ్రూప్ లో ఏకంగా 6 కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఓ దశలో 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు కోలుకుని ఒక శాతం లాభంతో ముగిసింది.