Marriage : తొమ్మిదో పెళ్ళికి సిద్దమైన మహిళ.. వైద్య పరీక్షల్లో ఎయిడ్స్ అని తేలింది.

యువకులను, విడాకులైన వ్యక్తులను టార్గెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్న మహిళని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నిర్దారణ అయింది.

Marriage : తొమ్మిదో పెళ్ళికి సిద్దమైన మహిళ.. వైద్య పరీక్షల్లో ఎయిడ్స్ అని తేలింది.

Marriage

Marriage : పెళ్ళికావలసిన యువకులు, భార్యల నుంచి విడిపోయిన వ్యక్తులను టార్గెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తుంది. తీరా చేసుకున్న తర్వాత వారిని ముప్పుతిప్పలు పెట్టి వారిని నుంచి విడాకులు తీసుకుంటుంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. 9 పెళ్లి చేసుకుంటుండగా పోలీసులకు చిక్కింది.

వివరాల్లోకి వెళితే హరియాణా రాష్ట్రం కైతల్‌ జిల్లాకు చెందిన మహిళ 2010లో ఓ వ్యక్తిని వివాహమాడింది. ఇద్దరు పిల్లలైనా తర్వాత 2014 ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో ఆమె కొన్నాళ్ళు కష్టపడి పనిచేసి పిల్లలను పోషించింది. ఈ సమయంలోనే ఆమె మనసులో ఓ దురాలోచన పుట్టింది. సులువుగా డబ్బు సంపాదించాలని పథకం వేసింది. ఈ సమయంలోనే విడాకులైన వ్యక్తులు, పెళ్లి కావలసిన యువకులను టార్గెట్ చేసింది. మహిళ చేసే పనికి ఆమె తల్లి కూడా సహకరించింది. ఆలా 2015 నుంచి 2021 వరకు 7 పెళ్లిళ్లు చేసుకుంది. మొదటి భర్తతో కలిపి 8.

పెళ్లి చేసుకోవడం పదిరోజులపాటు పద్దతిగా ఉండటంతో ఆ తర్వాత చేసుకున్న వ్యక్తితో గొడవకు దిగడం.. విడాకులు ఇవ్వాలని విధించడం.. విడాకులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం. ఇలా బెదిరింపులకు దిగుతుండటంతో ఎంతో కొంత ఇచ్చి వదిలించుకునేవారు. ఇక తాజగా ఆమె 9వ పెళ్లి చేసుకుంటుండగా పోలీసులు ప్రత్యేక్షమయ్యారు పెళ్లి చేసుకుంటున్న వ్యక్తికి ఆమె గతంలో చేసిన ఘనకార్యం గురించి చెప్పారు. మహిళను అదుపులోకి తీసుకోని స్టేషన్ కి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ నిర్దారణ అయింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్న 8 మంది భయంతో వణికిపోతున్నారు. తమకు వైరస్ సోకే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా పోలీసులు పరీక్షలు చేయించనున్నారు.