Covid Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ 75రోజుల పాటు ఉచితం

కొవిడ్ బూస్టర్ డోసును యుక్త వయస్సు వాళ్లందరికీ రేపటి (జులై 15) నుంచే ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 75రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డోసులు అందించనుంది ప్రభుత్వం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు.

Covid Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ 75రోజుల పాటు ఉచితం

Covid 19 Vaccine

 

Covid Booster Dose: కొవిడ్ బూస్టర్ డోసును యుక్త వయస్సు వాళ్లందరికీ రేపటి (జులై 15) నుంచే ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 75రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డోసులు అందించనుంది ప్రభుత్వం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు.

దీని ద్వారా 18-59 ఏళ్ల మధ్య వయస్కులు అంటే 77కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకూ 26శాతం అంటే 16కోట్ల మంది 60లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ అందించారు.

భారత జనాభాలో చాలా మంది తొమ్మిది నెలల క్రితమే రెండో డోసు తీసుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇతర అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థల ప్రకారం.. మొదటి డోస్ లేదా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలలకు బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూన్ రెస్పాన్స్ మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Read Also: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం

75రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కులకు ముందుజాగ్రత్తగా ఉచిత డోస్ ఇప్పించనుంది. జులై 15నుంచి గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది. కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం సెకండ్ డోసుకు బూస్టర్ డోసుకు ఉండాల్సిన వ్యత్యాసాన్ని తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు తగ్గించింది.