PM Modi : ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరం : ప్రధాని మోదీ

296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని 14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు.

PM Modi : ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరం : ప్రధాని మోదీ

Pm Modi

PM Modi : ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ ఉచితాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా… దేశ భవిష్యత్‌నూ నిర్మిస్తోందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రారంభించారు.

296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని 14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో జలౌన్ జిల్లా ఒరాయ్‌ మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

GST: వైద్య సేవలపై జీఎస్టీ తొలగించండి: కేంద్రానికి ఐఎమ్ఏ లేఖ

ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో చిత్రకూట్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణం 3, 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్‌ పరుగులు పెడుతుందన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ​నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు మెరుగపడటమే కాకుండా, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఇదంతా డబుల్‌ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమవుతోందని ప్రధాని మోదీ అన్నారు.

ఉచిత హామీల పేరిట ఓట్లు గడించేవాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. తనను టార్గెట్‌ చేసి విమర్శిస్తున్న వాళ్లు.. వేలకోట్లు వెచ్చించి విమానాలు, ప్రైవేట్‌జెట్‌లు కొనుగోలు చేశారన్నారు. ఉచితంగా విద్య, వైద్య సదుపాయాలను విద్యార్థులకు, పౌరులకు అందించడం తప్పా అని నిలదీశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని.. ఉచితంగా నాణ్యమైన చదువు వాళ్లకు అందించడం నేరమా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.