BJP On Freebies: ఓటర్లను ఆకర్షించేందుకే ‘ఉచితాలు ’.. సంక్షేమంతోనే అభివృద్ధి.. ఎన్నికల కమిషన్‌కు తెలిపిన బీజేపీ

దేశంలో పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల హామీలు ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని బీజేపీ అభిప్రాయపడింది. అదే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది.

BJP On Freebies: ఓటర్లను ఆకర్షించేందుకే ‘ఉచితాలు ’.. సంక్షేమంతోనే అభివృద్ధి.. ఎన్నికల కమిషన్‌కు తెలిపిన బీజేపీ

BJP On Freebies: ఉచిత పథకాలు ఓటర్లను ఆకర్షించేందుకే ఉపయోగపడతాయని, అదే సంక్షేమ పథకాలతో ప్రజల సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడింది బీజేపీ. ఉచిత పథకాల అమలు, పార్టీల వైఖరి వంటి అంశాలపై భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన నోటీసులకు బీజేపీ బదులిచ్చింది.

Vladimir Putin: మోదీ నిజమైన దేశ భక్తుడు.. ప్రశంసించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

ఈ మేరకు తమ పార్టీ అభిప్రాయాల్ని ఈసీకి తెలిపింది. ఉచిత పథకాల హామీల విషయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అమల్లోకి తెచ్చే అంశంపై ఈసీ ప్రశ్నించింది. దీనికి బీజేపీ బదులిస్తూ ఉచిత పథకాలు ఓటర్లను ఆకర్షించేందుకే ఉపయోగపడతాయని, సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనేది తమ పార్టీ వైఖరి అని చెప్పింది. మరోవైపు పార్టీలు మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఉచిత పథకాల్ని ఎలా అమలు చేస్తారో, వాటికి నిధులు ఎలా సమకూర్చుకుంటారో ముందుగానే చెప్పాలనే ఈసీ నిర్ణయం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ చెప్పింది. అంటే ఈసీ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే.. ప్రతి పార్టీ తాము ఇచ్చే ఉచిత హామీల్ని ఎలా అమలు చేస్తారో, నిధులు ఎలా సర్దుబాటు చేస్తారో ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. ఓటర్ల సాధికారతకు, వారి సామర్ధ్యాన్ని పెంచే విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని ఈసీకి ఆ పార్టీ బదులిచ్చింది.

Elon Musk: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు

ఉచిత ఇండ్లు, రేషన్ సరుకుల విషయంలో కూడా బీజేపీ స్పందించింది. ఇల్లు ప్రతి ఒక్కరి కనీస అవసరం అని, అది జీవితంలో ఒక్కసారి మాత్రమే అందజేస్తామని, అయితే.. కోవిడ్ సందర్భంగా రేషన్ బియ్యం అర్హులకు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొంది. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాల విషయంలో కొంతకాలంగా ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆప్ ఇస్తున్న ఉచిత హామీలను బీజేపీ తప్పుబడుతోంది. అందుకే ఈ అంశంపై ఈసీ కూడా దృష్టి సారించి పలు పార్టీలకు నోటీసులు జారీ చేసింది.