India Covid : భారత్‌‌లో కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే

24 గంటల్లో బుధవారం దేశ వ్యాప్తంగా 2 వేల 539 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 60 మంది చనిపోయారని...

India Covid : భారత్‌‌లో కరోనా కేసులు.. 24 గంటల్లో ఎన్నంటే

India Covid

Covid 19 Cases In India : కరోనా నుంచి భారతదేశం మెల్లిమెల్లిగా విముక్తి కలుగుతోంది. గత కొన్ని రోజులుగా మూడు వేల కిందకు కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బుధవారం దేశ వ్యాప్తంగా 2 వేల 539 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 60 మంది చనిపోయారని, ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా ఉన్నట్లు, దేశంలో 30 వేల 799 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొంది.

Read More : South Korea Corona : ఒక్కరోజే 4లక్షలకు పైగా కరోనా కేసులు.. దక్షిణ కొరియాలో కోవిడ్ కల్లోలం

ఒక్కరోజులో వైరస్ నుంచి 4 వేల 491 మంది బాధితులు కోలుకున్నట్లు, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,24,54,546కి చేరింది. రికవరీ రేటు 98.72గా ఉంది. దేశ వ్యాప్తంగా 30 వేల 799 మంది వైరస్ తో బాధ పడుతున్నారు. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 180.80 కోట్లీ టీకాలను పంపిణీ చేయడం జరిగిందని వైద్య శాఖ తెలిపింది. బుధవారం 12 నుంచి 14 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు వేస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Telangana Covid Numbers : తెలంగాణలో కొత్తగా 75 కరోనా కేసులు

తొలిరోజు ఈ వయస్సు వారిలో 2,60,136 మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 2.15 కోట్ల మంది ప్రికాషన్ డోసులు తీసుకున్నట్లు పేర్కొంది. ఇక దేశ వ్యాప్తంగా 7,17,300 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు, వాటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 78.12 కోట్లు పరీక్షలు చేయడం జరిగిందని వైద్య శాఖ తెలిపింది.