LPG Price : నవంబర్ 01వ తేదీ..మారనున్న రూల్స్
దేశ వ్యాప్తంగా నవంబర్ 01వ తేదీ నుంచి కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అందులో ప్రధానమైంది గ్యాస్ ధర.

Nov1
November 1 Major Changes : ఒకటో తారీఖు వస్తుందనగానే…వచ్చే డబ్బు ఎంత ? ఎంత ఖర్చు పెట్టాలనే దానిపై ఆలోచిస్తుంటారు. అన్నీ ఒకటో తేదీనే ముడిపడి ఉంటాయి. ఇంటి ఖర్చులు, పాల బిల్లు..ఇలా అన్నిరకాల లావాదేవీలన్నీ ఒకటో తేదీనే పూర్తి చేస్తాం. ప్రభుత్వాలు కూడా కొన్ని నిబంధనలు అమల్లోకి తెస్తుంటాయి. ఇవి కూడా..మొదటి తేదీనే ముడిపడి ఉంటాయి. ఇప్పుడు నవంబర్ 01 వచ్చేస్తోంది. దేశ వ్యాప్తంగా నవంబర్ 01వ తేదీ నుంచి కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అందులో ప్రధానమైంది గ్యాస్ ధర. ఇది వేయి రూపాయలవుతుందని అనుకుంటున్నారు. ఇక ఎలాంటి కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయో చూద్దాం.
Read More : Huzurabad Bypoll : బీజేపీదే విజయం – బండి సంజయ్
బ్యాంక్ ఆఫ్ బరోడా : –
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిర్దేశిత పరిమితిని మించి…డిపాజిట్లు.. లేదా డబ్బులను డ్రా చేయడంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. వీటిపై నవంబర్ 01 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిబంధనలు సేవింగ్స్, ఖాతాదారులతో పాటు వేతన ఖాతాదారులకు వర్తిస్తాయి. ఇతర బ్యాంకులు కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Read More : Telugu States Bypoll : హుజూరాబాద్, బద్వేల్‌లో పోలింగ్ సమాప్తం
భారతయ రైల్వే టైం టేబుల్ : –
భారత రైల్వే రైళ్ల టైబుల్ లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నవంబర్ 01 నుంచి పలు రైళ్లకు కొత్త టైమ్ టేబుల్ ప్రకటించనుంది. 13 వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల టైమింగ్ లో మార్పు రానున్నట్లు తెలుస్తోంది.
Read More : Chandrababu Yv Subbareddy: చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం
ఎల్ పీజీ ధరలు : –
చమురు కంపెనీలు ధరలు పెంచుతూ పోతున్నాయి. రోజుకో కొద్ది పైసల చొప్పున పెరిగిపోతుండడంతో సామాన్య మానవుడు తల్లడిల్లిపోతున్నాడు. ఒకటో తేదీ నుంచి ఎల్ పీజీ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం ఉందని సమాచారం. క్రూడ్, ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగితే మాత్రం…ఎల్ పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు రానున్నాయని సమాచారం.
Read More : Pfizer Vaccine: ‘5 ఏళ్లు దాటిన వారికి ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు’
ఎల్పీజీ సిలిండర్లు : –
నవంబర్ 01వ తేదీన ఎల్ పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్స్ లో కీలక మార్పులు చోటు చేసుకబోతున్నాయి. సిలిండర్లు డెలివరీ కావాలంటే..మాత్రం వినియోగదారులు ఖచ్చితంగా వన్ టైమ్ పాస్ వర్డ్ అందించాల్స ఉంటుంది. డెలివరీ అథెంటికేషన్ కోడ్ లో భాగంగా…ఎల్ పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్ లో ఈ మార్పు రానుందని తెలుస్తోంది.