ఇక ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ కావు, కేంద్రం కొత్త రూల్, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మాయమవుతోంది. ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మాయమవుతోంది. విషయం తెలిసే లోపు సైబర్ క్రిమినల్స్ దోచేస్తున్నారు. ఈ సైబర్ నేరాలపై కేంద్రం ఫోకస్ చేసింది. సైబర్ నేరాలకు, మోసగాళ్లకు చెక్ చెప్పేలా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ కావు, కేంద్రం కొత్త రూల్, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

Automatic Bill Payments

Automatic Bill Payments : ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ మాయమవుతోంది. విషయం తెలిసే లోపు సైబర్ క్రిమినల్స్ దోచేస్తున్నారు. ఈ సైబర్ నేరాలపై కేంద్రం ఫోకస్ చేసింది. సైబర్ నేరాలకు, మోసగాళ్లకు చెక్ చెప్పేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆటోమేటిక్‌గా జరిగే చెల్లింపుల (స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌) విధానంలో మార్పులు చేసింది.

ప్రతి నెల కట్టే హోమ్ లోన్స్ ఈఎంఐ నుంచి టెలిఫోన్ బిల్లులు వరకు.. వాటంతట అవే.. బ్యాంకు అకౌంట్ నుంచి చెల్లింపులు జరిగేలా స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తుంటారు చాలామంది. ఇకపై వేటికిపడితే వాటికి ఆటోమేటిక్ చెల్లింపులు కుదరవు. ఇంటి రుణం(హోమ్ లోన్స్), వాహన రుణం(వెహికల్ లోన్స్), మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎల్‌ఐసీ వంటి కొన్ని సేవలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఓటీటీ సేవలు, డీటీహెచ్‌ బిల్లులు, ఫోన్‌ బిల్లులు వంటి సేవలకు ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవ్వవు.

ఇలాంటి సేవలకు ఖాతాదారులు ఇచ్చిన స్టాండర్డ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఏప్రిల్‌ 1 నుంచి డీయాక్టివేట్‌ అవుతాయి. పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు మెయిల్స్‌ రూపంలో ఈ సమాచారం పంపించాయి. ఇకపై ఇలాంటి సేవలకు బిల్లులు చెల్లించాలంటే ఆయా కంపెనీల వెబ్‌సైట్‌ లేదా యాప్‌ల ద్వారా చెల్లించుకోవాల్సిందే. క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ద్వారా మీరు చెల్లింపులు చేసుకోవడంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే… ఈ చెల్లింపులకు మళ్లీ ఓటీపీ అవసరమవుతుంది. బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడంపైనే ఈ లావాదేవీలు ‘సక్సెస్‌’ అయ్యే అవకాశముంది.

ఈ కొత్త విధానంతో కొంతమందికి అసౌకర్యం కలగొచ్చు. మాకు మతిమరుపు ఉంది, ప్రతి నెల గుర్తు పెట్టుకుని బిల్లులు చెల్లింపులు చేయాలంటే సమస్యగా ఉంటుంది, ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ ఎంచుకున్నామని అనే వాళ్లూ ఉన్నారు. తప్పదు మరి, ఓ మంచి లక్ష్యంతో కేంద్రం ఈ విధానం తీసుకొచ్చింది. మరి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంతో కొంతవరకైనా సైబర్ నేరాలకు బ్రేక్ పడుతుందని ఆశిద్దాం.