Patna to Ludhiana : 19 ఏళ్ల యువతి, చేతిలో పైసా లేదు..భర్త కోసం 1400 కి.మీ. ప్రయాణం

భార్య మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్తను వెదుక్కుంటూ 19 ఏళ్ల భార్య ఇంట్లోంచి బయలుదేరింది. చేతిలో చిల్లిగవ్వ లేదు..ఎలా వెళ్లాలో తెలీదు..అయినా భర్తను వెతుక్కుంటూ బీహార్ లోనే పాట్నా నుంచి పంజాబ్ లోని లూథియానా వరకూ ప్రయాణించింది. నువ్వెవరో నాకు తెలీదన్న భర్త మాటలు విని నిర్ఘాంత పోయింది.

Patna to Ludhiana : 19 ఏళ్ల యువతి, చేతిలో పైసా లేదు..భర్త కోసం 1400 కి.మీ. ప్రయాణం

Patna To Ludhiana (1)

19 year women search for her husband : భర్త కోసం సావిత్రి యముడితో పోరాడిందని పురాణాల్లో చదువుకున్నాం. కానీ ఓ భార్య చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్త కోసం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది. అలా దాదాపు 1400 కిలోమీటర్లు దూరంలో ఉన్న భర్త దగ్గకు బయలుదేరింది. అలా పంజాబ్ లోని లూథియానా వరకూ ప్రయాణించింది. ఆ భార్య వయస్సు 19 ఏళ్లు. చేతిలో ఫోన్ లేదు. చిల్లిగవ్వ కూడాలేదు. అయినా భర్తను కలుసుకోవాలనే ఆశ..ఆకాంక్షతో బీహార్ లోని పాట్నా నుంచి బయలుదేరింది. చేతిలో డబ్బులు లేకుండా అంత దూరం ఎలా? వెళ్లాలి? అని ఆమె ఆలోచించలేదు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే. భర్తను కలుసుకోవాలి. బత్రిమాలి ఇంటికి తెచ్చుకోవాలి. తన ఇద్దరు పిల్లలు, భర్తతో కలిసి ఉండాలి. అంతే..అదే ఆకాంక్షతో భర్తను వెతికే పనిలో పడింది. అప్పుడు ఆమె చేతిలో ఉన్నది కేవలం భర్త ఫోన్ నంబర్ ఒక్కటే..

ఆమెకు తెలిసిందల్లా ఒకటే..తన భర్త లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలోని ఓ చోట పనిచేస్తున్నాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను పాట్నాలో తెలిసినవారి వద్ద వదిలేసి లూథియానా వచ్చి భర్తను వెతికే పనిలో పడింది. భర్త కోసం పిచ్చిదానిలా వెతకటం ప్రారంభించింది. ఆమె అలా వెతకడం గమనించిన లూథియానాలో బుద్ధ దేవ్ అనే ఓ వ్యక్తి ఆమె విషయం ఏమిటి? ఈ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్నావు..పైగా చిన్నవయస్సులో ఉన్నావు..ఇలా ఎవరి కోసం వెతుతున్నావ్? అనిఅడిగాడు. దానికి ఆమె చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాడు.

ఆమెను చూసి జాలి పడిన బుద్ధదేవ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆకలితో ఉన్నావు..నీరసించిపోయావు..ముందు ఆహారం తిను అంటూ కడుపునిండా అన్నం పెట్టాడు. ఆశ్రయం ఇచ్చాడు. ఈరోజు ప్రశాంతంగా ఉండు రేపు పోలీసుల దగ్గరకెళ్లి విషయం చెబుదాం అని చెప్పి..మరుణాడు ఆమెను లూథియానా నగర అదనపు బీసీపీ ప్రగ్యా జైన్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ ఆమె భర్త గురించి పూర్తి వివరాలు చెప్పలేకపోయింది.

తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లైందని..నా భర్త పేరు జాన్‌. ఇద్దరు పిల్లలు పుట్టాక చిన్న గొడవ వల్ల తనను పిల్లలను వదిలి ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడని తెలిపింది. తరువాత ఫోన్ చేసి నేను లూథియానాలో ఉన్నానని చెప్పాడని..కానీ రమ్మంటే నేను రాను అని చెప్పాడని వాపోయింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా..నా ఇద్దరు పిల్లలను తెలిసినవారి వద్ద వదిలి ..కనీసం డబ్బులు కూడా తీసుకురాకుండా భర్త కోసం పాట్నా నుంచి లూథియానా వచ్చేసానని చెప్పింది.

అలా డీసీపీ ప్రగ్యా జైన్ ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పలు రకాలుగా యత్నించినా ఆచూకీ లభించలేదు. అలా అతని ఫోన్ నంబర్ ఆధారంగా చివరకు ఆమె భర్త జాన్‌ను కనిపెట్టారు. మొదట ఈమె ఎవరో తెలీదని జాన్ అబద్దాలు ఆడాడు.కానీ పోలీసులు భయపెట్టటంతో ఆమె నా భార్య అని ఒప్పుకున్నాడు. పోలీసుల కౌన్సిలింగ్ తో ఆమెతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే బీహార్ నుంచి పిల్లలను తీసుకొచ్చి లూథియానాలోనే ఉంటామని చెప్పాడు.