SBI Theft: ఎస్బీఐ లాకరు నుంచి 2.8కేజీల బంగారం దొంగతనం

ఎస్బీఐ బ్యాంకు లాకరు నుంచి 2కేజీల 800గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. భైజ్‌నాథ్ పోలీస్ క్యాంప్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. బ్యాంకులో క్లీనర్ గా పనిచేస్తున్న ఉమేశ్ మాలిక్ ఏప్రిల్ 23 నుంచి పరారీలో ఉండటంతో నిందితుడిగా అనుమానిస్తూ కేసు ఫైల్ చేశారు.

SBI Theft: ఎస్బీఐ లాకరు నుంచి 2.8కేజీల బంగారం దొంగతనం

Sbi

 

SBI Theft: ఎస్బీఐ బ్యాంకు లాకరు నుంచి 2కేజీల 800గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. భైజ్‌నాథ్ పోలీస్ క్యాంప్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. బ్యాంకులో క్లీనర్ గా పనిచేస్తున్న ఉమేశ్ మాలిక్ ఏప్రిల్ 23 నుంచి పరారీలో ఉండటంతో నిందితుడిగా అనుమానిస్తూ కేసు ఫైల్ చేశారు.

ఘటనపై యాక్షన్ తీసుకుంటూ ఇద్దరు బ్యాంకు అధికారులను విధుల్లో నుంచి తొలగించారు. వారిలో ఒకరు క్యాష్ ఇన్ ఛార్జ్ కాగా, మరొకరు సర్వీస్ మేనేజర్ గా రిపోర్టులు చెబుతున్నాయి. బ్యాంక్ లోపలి సేఫ్టీఇష్యూ గురించి వీరిద్దరే చూసుకుంటారని అధికారులు వెల్లడించారు.

మొత్తం 48 బ్యాగుల బంగారం మిస్ అయినట్లు తెలిసింది. తదుపరి విచారణ కొనసాగుతుంది. దొంగతనం జరిగిన మరుసటి రోజు నుంచి బ్యాంక్ క్లీనర్ విధుల్లోకి రావడం లేదని తెలిసి అనుమానితుడిగా పరిగణిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Read Also : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఈ ఫోన్‌ నెంబర్స్‌తో జాగ్రత్త

రీజనల్ మేనేజర్ బీకే సింగ్ కథనం ప్రకారం.. లోన్ల రూపంలో కస్టమర్లు దాచి ఉంచిన బంగారాన్ని లాకర్ లో ఉంచాం. ఆ బంగారం విలువ ప్రస్తుతమున్న మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.