Frozen Waterfall: బాబోయ్ చలి.. హిమాచల్ ప్రదేశ్‌లో గడ్డకట్టిన జలపాతం.. వీడియో వైరల్

హిమాలయాలకు దగ్గరగా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో నీళ్లుసైతం గడ్డకడుతున్నాయి. హిమాచల్ కులులోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Frozen Waterfall: బాబోయ్ చలి.. హిమాచల్ ప్రదేశ్‌లో గడ్డకట్టిన జలపాతం.. వీడియో వైరల్

Frozen Kulu Falls

Frozen Waterfall: చలి చంపేస్తోంది. ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళితే గడ్డకట్టిపోతామా అన్నంతస్థాయిలో చలి తీవ్రత ఉంది. రాత్రి, ఉదయం అనే తేడాలేకుండా పలు ప్రాంతాలు పొగమంచును కప్పుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చలి వణికిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Beautiful Nohkalikai Water Fall : పచ్చని కొండల్లో అందాల జలపాతం వెనుక అంతులేని విషాదం ..

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో నీరుసైతం గడ్డకట్టిపోతుంది. మరోవైపు హిమాలయాలకు దగ్గరగా ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో నీళ్లుసైతం గడ్డకడుతున్నాయి. హిమాచల్ కులులోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది.

 

గడ్డకట్టిన జపాతం అందాలను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అచ్చం చెక్కిన శిల్పాల మాదిరిగా జలపాతం గడ్డకట్టుకుపోయింది. గడ్డకట్టిన జలపాతం వద్ద స్థానిక ప్రజలు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.